Mokshagna: ముందుగానే ఆ హీరోయిన్ కి స్కెచ్ వేసిన బాలయ్య!

టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త వారసులు రాబోతున్నాడు. అతను ఎవరో కాదు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ. నందమూరి కుటుంబం నుంచి ఎంట్రీ ఇస్తున్నప్పటికీ.. దానికి తగ్గ అవుట్ పుట్ ఉంటేనే..ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకోసం వీరు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. నందమూరి అభిమానులు ఎప్పటి నుండో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం కళ్లుకాయలు ఎదురుచూస్తున్నారు. గత మూడేళ్లుగా ఇదిగో ఎంట్రీ..అదిగో ఎంట్రీ అంటున్నారు తప్ప అధికారికంగా మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఫై క్లారిటీ ఇవ్వడం లేదు.

ప్రస్తుతం మోక్షజ్ఞ (Mokshagna) అమెరికా లో యాక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ గ్యారెంటీ అంటున్నారు. ఇదిలా ఉంటె మోక్షజ్ఞ మొదటిసినిమాలో హీరోయిన్ గా మాత్రం శ్రీలీలనే అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ ఎవరా అంటే శ్రీలీల అని చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు జోడి కడుతుంది. అంతే కాదు బాలకృష్ణ – అనిల్ కలయికలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి మూవీ లో బాలకృష్ణ కూతురి పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమా సమయం లోనే బాలయ్య కు శ్రీలీల తెగ నచ్చేసిందట. పెద్దల పట్ల శ్రీలీల కి ఉన్న గౌరవం, ఆమెలోని చాలాకితనం బాలయ్య కి బాగా నచ్చిందట. వచ్చే ఏడాది నా కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడు. వాడి మొదటి సినిమాలో నువ్వే హీరోయిన్ గా నటించాలి. మళ్ళీ డేట్స్ కుదర్లేదు లాంటి సాకులు చెప్పకూడదు ముందే చెప్తున్నా అని అన్నాడట.

దానికి శ్రీలీల నవ్వుతు మీరు ఏది చెప్తే అదే అంటూ సమాధానం చెప్పిందట. దీనితో డైరెక్టర్ కూడా ఖరారు కాని బాలయ్య మొదటి సినిమాకి హీరోయిన్ గా శ్రీలీల ఫిక్స్ అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా శ్రీలీల నటిస్తే సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus