Balayya Babu, Rajamouli, Mahesh Babu: రాజమౌళి – మహేష్‌ సినిమాలో బాలయ్య?

కొన్ని రూమర్లు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ… భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఇవి నిజమైతే బాగుండు అని అనిపిస్తాయి. ఒకానొక సమయంలో అసలు ఆ పుకారు ఎందుకు నిజం కాలేదు అని కూడా అనిపిస్తుంది. అలాంటి ఓ రూమర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ రూమర్‌ గురిచి మీరూ వింటే… ‘భలే భలే’ అని తప్పకంటారు. అదే రాజమౌళి – మహేష్‌బాబు సినిమాలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారట.

Click Here To Watch Now

ఇంట్రెస్టింగ్‌గా ఉందిగా… రాజమౌళి – మహేష్‌బాబు సినిమా అంటేనే ఆసక్తి… అలాంటిది ఆ సినిమాలో ఇప్పుడు బాలకృష్ణ కూడా అంటే ఆ ఆసక్తి డబుల్‌, ట్రిపుల్‌ అవుతుంది. అయితే ఈ పాత్ర సినిమాలో సుమారు 40 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి – మహేష్‌బాబు సినిమాలో బాలయ్య ఉన్నాడు అనే మాట… ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ… ఉంటే బాగుండు అనే వార్త మాత్రం చక్కర్లు కొడుతున్నాయ్‌. ఒకవేళ జరిగితే మహేష్‌ – రాజమౌళి సినిమా మల్టీ స్టారర్‌గా మారుతుందంటూ ఆ మధ్య వచ్చిన వార్తలు నిజమవుతుంది.

మహేష్‌బాబు – రాజమౌళి సినిమా చాలా ఏళ్ల క్రితమే ప్రకటించారు. నిర్మాత కేఎల్‌ నారాయణ ఇప్పటికే దర్శక హీరోలకు అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారని అంటారు. అయితే ఓవైపు మహేష్‌బాబు, మరోవైపు రాజమౌళి వరుస సినిమాలు చేస్తుండటతో ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్‌’ తర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం. ఇప్పటికే కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా కథను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారట.

ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో అడ్వంచరెస్‌ జోనర్‌లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. దీని కోసం రాజమౌళి టీమ్‌ ఓ నవల హక్కులను కొనుగోలు చేశారని కూడా అంటారు. అయితే దీనిపై క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో కథానాయికగా ఆలియా భట్‌ను ఎంపిక చేయాలనుకుంటున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌, ఆలియా అనౌన్స్‌మెంట్‌ ఉంటాయని భోగట్టా. పనిలో పనిగా బాలయ్య విషయం కూడా తేలితే బాగుండు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus