Balayya Babu: కొడుకు విషయంలో.. అభిమానులకి కొంత రిలీఫ్ ఇచ్చిన బాలయ్య!

  • July 12, 2023 / 02:15 PM IST

నందమూరి బాలకృష్ణ… తన కొడుకు మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చింది లేదు. అభిమానులు మాత్రం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి, నాగార్జున తమ కొడుకులని హీరోలుగా లాంచ్ చేయడం జరిగింది.వెంకటేష్ కొడుకు ఎలాగూ వయసులో చిన్నోడు. కాబట్టి నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల చూపంతా మోక్షజ్ఞ డెబ్యూ పైనే ఉంది. గత 4 ఏళ్లుగా అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అంటూ కామెంట్లు వినిపించాయి.

మోక్షజ్ఞ కూడా ఫిజిక్ పై దృష్టి పెట్టి ఇప్పుడు స్టైలిష్ గా రెడీ అయ్యాడు. కానీ మోక్షజ్ఞ డెబ్యూ పై బాలయ్య మాత్రం మాట దాటేస్తూనే వచ్చాడు. అయితే ఎట్టకేలకు ఆయన తన కొడుకు డెబ్యూ విషయమై స్పందించినట్టు సమాచారం. ఫిలదెల్ఫియా లో ఉన్న తానా కన్వెన్షన్ లో భాగంగా బాలయ్య ఈ విషయం పై స్పందించినట్టు సమాచారం. ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్ గా ‘ఆదిత్య 999 మాక్స్’ ను రూపొందించబోతున్నట్టు (Balayya Babu) బాలయ్య ఆల్రెడీ చెప్పాడు.

ఈ చిత్రానికి అతనే డైరెక్ట్ చేయబోతున్నాడు. స్క్రిప్ట్ పనులు కూడా మొదలుపెట్టాడట. బాలయ్య కూడా ఈ చిత్రంలో నటిస్తాడట. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ కూడా నటుడిగా ఎంట్రీ ఇస్తాడని బాలయ్య తెలిపాడు. ఇంతకు మించి ఏమీ అడగొద్దని కూడా ఈ సందర్భంగా బాలయ్య తెలియజేసినట్టు సమాచారం. ఏదైతేనేం.. ఎక్కువ డీటెయిల్స్ తెలీకపోయినా మోక్షజ్ఞ డెబ్యూ పై క్లారిటీ ఇచ్చినందుకు అటు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తిని పెంచినట్టయ్యింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus