Balakrishna: బాలయ్యను చూసి దెయ్యం అనుకున్నారట…

  • November 5, 2021 / 12:03 PM IST

నందమూరి కుటుంబం అంటే క్రమశిక్షణ, సమయపాలన అంటుంటారు. పెద్దాయన ఎన్టీఆర్‌ దగ్గర నుండి బాలయ్య వరకు ఎప్పుడూ ఇదే విషయం చెబుతుంటారు. ఈ క్రమంలో రోజూ వేకువజామునే నాలుగు గంటలలోపు నిద్రలేచి కసరత్తులు చేయడం, వాకింగ్‌ చేయడం లాంటివి చేస్తుంటారు. అలా కొన్నేళ్ల క్రితం జరిగిన సరదా విషయాన్ని బాలయ్య ఇటీవల పంచుకున్నారు. ఆ విషయం మీకూ తెలిస్తే ఎంచక్కా నవ్వుకుంటారు. ఇది కచ్చితంగా ఎన్నేళ్ల క్రితం అని చెప్పలేం కానీ…

ఎప్పటిలాగే ఆ రోజు బాలయ్య ఉదయాన్నే నాలుగు లోపు నిద్రలేచి వాకింగ్‌కి వెళ్లడానికి కేబీఆర్‌ పార్క్‌కి చేరుకున్నారట. అప్పటికి పార్క్‌ సెక్యూరిటీ గేట్లు తెరవలేదట. దీంతో బాలయ్యనే గోడ దూకి లోపలకు వెళ్లి వాకింగ్‌ ప్రారంభించారట. అక్కడి కాసేపటికి గేటు తీయడానికి సెక్యూరిటీ వచ్చారట. లోపల చీకటిలో బాలయ్యను చూసి దెయ్యం అనుకున్నాడట ఆయన.సెక్యూరిటీ వ్యక్తి ఉలికిపాటును చూసి బాలయ్య… ‘బాబూ నేను బాలకృష్ణను’ అని చెప్పారట. దాంతో అతను కుదుటపడ్డాడట.

అంత టైమింగ్‌ పాటించే తత్వం బాలయ్యది. ‘ఆహా’లో కొత్తగా ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాలయ్యను ఈ విషయాల్ని చెప్పుకొచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్‌ కూడా ఇలా సమయపాలన చేసేవారని చెప్పుకొచ్చు బాలకృష్ణ.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus