Balakrishna: ‘ఆహా’ ఇండియన్ ఐడల్ తెలుగు: టాప్ 6 తో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ సందడి..!

ఇండియా వైడ్ పాపులర్ అయిన… ఇండియన్ ఐడల్ షోని తెలుగు వారి కోసం ‘ఆహా’ ఓటీటీ వారు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గాన గంధర్వులను వెలికి తీసే లక్ష్యంతో ఈ షోని ప్రారంభించగా….శ్రీరామ్ చంద్ర హోస్ట్ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.నిత్యా మేనన్,కార్తీక్, తమన్ లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో కూడా ఈ షో ప్రజాధారణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 27 ఎపిసోడ్లు కంప్లీట్ అవ్వగా ఇప్పుడు 28వ ఎపిసోడ్ కు రంగం సిద్ధమైంది.

ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా 6 మంది సింగర్స్ ఎలిమినేట్ అవ్వడం కూడా జరిగింది.ప్రస్తుతం 6 మంది సింగర్స్ మిగిలారు. వాళ్ళే లాలస, వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్. వీళ్ళలో మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విజేత ఎవరు అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇదిలా ఉంగగా.. సెమీ ఫినాలే ఎపిసోడ్ కు బాలయ్య గెస్ట్ గా వచ్చి సందడి చేశాడు. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

‘సింహమంటి చిన్నోడే’ పాటకి కంటెస్టెంట్ లతో డాన్స్ చేసి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. ఆ తర్వాత కంటెస్టెంట్లతో సరదాగా ముచ్చటించి నవ్వులు పూయించారు. ‘క్యాజువల్ గా రాలేదు కాంపిటీషన్ కు వచ్చాను.. వైల్డ్ కార్డు ఎంట్రీ నేనిక్కడ’ ‘పెళ్ళెందుకయ్యా చేసుకోవడం.. .. అంటూ ఓ కంటెస్టెంట్ కు ‘భార్య ను ఏమార్చడం ఎలా’ అనే పుస్తకాన్ని బహూకరించాడు బాలయ్య.అలాగే వేరే కంటెస్టెంట్ కు మైక్ ను బహూకరించాడు. జూన్ 10న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఫుల్ ఎపిసోడ్ లో మరింత ఫన్ ఉండబోతుంది అనే భరోసా ఇచ్చింది ఈ టీజర్. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు కూడా కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags