ఎన్టీఆర్ గా చేయమంటే బాలయ్య భయపడుతున్నాడా..?

బాలయ్య కెరీర్ లో తన తండ్రిగారైన ఎన్టీఆర్ బియోపిక్స్ ఘోర పరాభవాన్ని చవిsచూసి తీరని మచ్చ తెచ్చిపెట్టాయి. కథానాయకుడు , మహానాయకుడు అని రెండు భాగాలుగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్స్ కనీస ఆదరణ నోచుకోలేక పోయాయి. బాలయ్య ఎన్టీఆర్ గా నటించిన ఈ చిత్రంలో రానా, సుమంత్, విద్యాబాలన్ వంటి స్టార్ క్యాస్ట్ తో పాటు టాలీవుడ్ లోని చాలామంది హీరోయిన్స్ తో అట్టహాసంగా భారీ ఎత్తున నిర్మించారు.

సంక్రాంతికి కానుగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీని పట్టింకున్న నాధుడే లేడంటే అతిశయోక్తి కాదు.బాలయ్య వీరాభిమానులు మినహా ఈ సినిమాను ఎవరూ చూడ లేదు. ఇక కొన్ని థియేటర్స్ ఎదుట ఉచిత ప్రదర్శన బోర్డులు వెలిశాయి. సినిమా పెట్టుబడిలో పావలా వంతు కూడా ఈ రెండు చిత్రాలు రాబట్టలేక పోయాయి. ఈ నేపథ్యంలో ఇకపై బాలయ్య ఎన్టీఆర్ పాత్ర చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారట. ఓ రకంగా ఆయన భయపడుతున్నట్లు తెలుస్తుంది.

ఇందుకు తాజా ఘటనే నిదర్శనం. తమిళ రాజకీయ సంచలనం, అందరూ అమ్మగా పిలుచుకునే జయలలిత బయోపిక్ తలైవి పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలితగా నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర కోసం బాలయ్యను దర్శక నిర్మాతలు సంప్రదించారట. ఐతే ఎన్టీఆర్ పాత్ర తాను చేయనని బాలయ్య కుండ బద్దలు కొట్టారట. ఎన్టీఆర్ బయో పిక్స్ నిర్మించిన విష్ణు వర్ధన్ ఇందుకూరి తలైవి నిర్మాతలలో ఒకరిగా ఉన్నారు. ఈ పరిచయంతో బాలయ్యను ఒప్పించే ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా అన్నారట. దీనితో ఎన్టీఆర్ పాత్ర కోసం వేరే నటుడిని వెతికే పనిలో చిత్రం బృందం ఉందని తెలుస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్స్ బాలయ్యను అంతగా బయపెట్టినట్లు తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus