దర్శకుడిగా తేజను క్రిష్ రీప్లేస్ చేయడం వెనుక కారణమదే

నందమూరి బాలకృష్ణ నటించి నిర్మించిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా  రేపు  ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు. అసలైతే ముందు ఎన్.టి.ఆర్ బయోపిక్ ను తేజ డైరక్షన్ చేయాలని అనుకున్నాడు బాలకృష్ణ. తేజ డైరక్షన్ లోనే సినిమా ఓపెనింగ్ కూడా చేశాడు. తేజ ఎందుకు తప్పుకున్నాడు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో క్రిష్ ఎలా ఎంటర్ అయ్యాడు అన్నది ఎవరి తెలియదు. ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకున్నారు అయితే తేజని కాదని క్రిష్ తో ఈ సినిమా పూర్తి చేయడంపై బాలకృష్ణ స్పందించారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ భారాన్ని తేజ మోయలేడని తెలుసుకున్నాడట. అందుకే దర్శకుడికి తలకు మించిన భారం కాకూడదని సినిమా డైరక్షన్ ఛాన్స్ తేజ నుండి క్రిష్ కు అప్పగించారట.

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా క్రిష్ డైరక్షన్ లోనే చేశాడు బాలకృష్ణ ఆ నమ్మకంతోనే తేజ ఈ సినిమా చేయడం కష్టమని భావించి వెంటనే క్రిష్ ను ఒప్పించాడట. ఏమాటకామాట క్రిష్ కాకుండా ఈ సినిమా తేజ దర్శకత్వంలోనే వచ్చుంటే ఇంత క్రేజ్ వచ్చేది కాదు అన్నది అందరు అనుకుంటున్నారు. జనవరి 9న విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రలోని కొంత భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బాలయ్య కెరియర్ లో ఏ సినిమా చేయని బిజినెస్ తో వస్తున్న ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus