రామోజీ ఫిలిం సిటీలో హీరోల కొట్లాటలు!

టాలీవుడ్ అగ్ర హీరోల షూటింగులతో రామోజీ ఫిలిం సిటీ కళ…కళ … లాడిపోతుంది. నందమూరి బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ … ‘ఆర్.ఎఫ్.సి’ లో కనువిందు చేస్తుండడం విశేషం. బాలయ్య – క్రిష్ డైరెక్షన్లో… ‘ఎన్టీఆర్ బయోపిక్’ నుండీ రెండవ భాగమైన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రానికి సంబందించిన బ్యాలన్స్ సీన్స్ ని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ర్యాలీ నేపధ్యంలో సాగే ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఇక దీంతో ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి… శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ‘ఎన్.బి.కె ఫిలిమ్స్’ మరియు ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేయడానికి బాలయ్య – క్రిష్ లు ప్లాన్ చేస్తున్నారు.

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’ చిత్ర షూటింగ్ కూడా ‘ఆర్.ఎఫ్.సి’ లోనే జరుగుతుంది. ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాల్లో భాగంగా కీలకమైన ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేసారట. సుజీత్ డైరెక్షన్లో తెరెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటి వరకూ 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగష్టు 15 న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కూడా ఇక్కడే షూటింగ్ జరుపుకుంటుండడం విశేషం. రాంచరణ్, జూ.ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ కి సంబందించిన కీలక సన్నివేశాల్ని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. రాంచరణ్ తో పాటు వందలాది మంది ఫైటర్ల పై.. ఈ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పోలీస్ చెక్ పోస్ట్ నేపధ్యంగా సాగే ఫైట్ సీక్వెన్స్ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తుందట. ఈ చిత్రం కోసం.. టాలీవుడ్ తో పాటూ.. యావత్ ‘ఇండియన్ సినీ ఇండస్ట్రీ’ ఎదురుచూస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus