బండి సరోజ్ కుమార్ నూతన చిత్రం ‘పరాక్రమం’ ప్రీ టీజర్ విడుదల

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకం పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున చిత్రం “పరాక్రమం”. ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ లో ముప్పై రోజులో షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి 14, 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క ప్రీ టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా

దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ  “మీడియా మిత్రులకు, పెద్దలకు నమస్కారాలు. బండి సరోజ్ కుమార్ అనే నేను ఒక నటుడిగా , దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చు. “కళ నాది. వెల మీద” అనే కాన్సెప్ట్ తో, డిజిటల్ platforms లో రిలీజ్ చేసిన “నిర్బంధం, మాంగల్యం” లాంటి క ల్ట్ సినిమాలో నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించింది. వాళ్ళు ఇచ్చిన బలంతో ఇప్పుడు నేను “BSK MAINSTREAM” అనే నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నాను. పిల్లా , పాపలతో కుటుంబాలు సినిమా హాల్ కు తరలి వచ్చే కథాంశం తో “పరాక్రమం” అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ” I,ME,MYSELF ” దీని టాగ్ లైన్ .

“పరాక్రమం” అనే ఈ చిత్రం యొక్క “Pre-Teaser” ను ఈ లేఖతో జత చేశాను . ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14 2024 న  విడుదల లక్ష్యంగా, ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ తో ముప్పై రోజుల షూటింగ్ తో ఈ చిత్రం  పూర్తవుతుంది.

ఈ చిత్ర కథాంశం  గురించి చెప్పాలంటే – గోదావరి జిల్లా లో “లంపకలోవ” గ్రామంలో పుట్టిన “లోవరాజు” అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం , రాజకీయం లాంటి ఘట్టాల ఆవిష్కరణ ఈ చిత్ర ముఖ్య కథాంశం. యువతను అన్ని విధాలుగా ఎంటర్టైన్  చేస్తూనే, వారిని మేల్కొలిపే ఒక మంచి కమర్షియల్ కథతో రాబోతున్నాను. నాతోపాటు ప్రతిభ ఉన్న నూతన నటీ, నటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతున్నాను.

దీనికి రచన, కూర్పు, సంగీతం, దర్శకత్వం నేనే వహిస్తుండగా మిగిలిన విభాగాల్లో ప్రతిభ గల సాంకేతిక
నిపుణులతో ఈ చిత్రం నిర్మించబడుతుంది. ఒక గొప్ప సంకల్పంతో నేను నిర్మించబోయే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లి నాకు, నా నిర్మాణ సంస్థ కి మరింత బలాన్ని చేకూర్చాలి అన్నది పాత్రికేయులకు నా విజ్ఞప్తి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus