మరో చెక్ బౌన్స్ కేసులో కోర్టుకెళ్లిన బండ్ల గణేష్

“గబ్బర్ సింగ్, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే టెంపర్” చిత్రాల నిర్మాతగా కంటే సచిన్ జోషి దగ్గర అప్పుగా భారీ మొత్తాన్ని తీసుకొని అతడ్ని మోసం చేసిన వ్యక్తిగానే అందరికీ గుర్తుండే బండ్ల గణేష్ మరోసారి డబ్బు విషయంలో లీగల్ నోటీసులు అందుకోవడమే కాక కోర్ట్ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ప్రొద్దుటూరుకు చెందిన 68 మంది బండ్ల గణేష్ కి వడ్డీకి డబ్బు ఇచ్చారట. ఎప్పట్లానే కొన్నాళ్లపాటు వడ్డీలు కట్టినట్లే కట్టి తర్వాత నుంచి కనీసం ఫోన్లు ఎత్తడం మానేశాడట. అనంతరం ఆ లావాదేవీలకు సంబంధించి ఆయన చెక్‌లు ఇస్తే అవన్నీ బౌన్స్‌ కావడంతో బాధితులు కోర్టును అశ్రయించారు. దాంతో.. బండ్ల గణేష్ పైన మూడు కేసులు నమోదయ్యాయి.

కోర్ట్ వారెంట్ ఇవ్వడంతో బండ్ల గణేష్‌ కోర్టుకు రీకాల్‌ చేసుకుని శుక్రవారం ప్రొద్దుటూరు ఫస్ట్‌ ఏడీఎం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యాడు బండ్ల గణేష్. ఆ మూడు కేసుల్లోనూ బండ్ల గణేష్ రాజీ చేసుకొన్నాడట. “టెంపర్” అనంతరం సినిమాలకు ఆల్మోస్ట్ స్వస్తిపలికిన బండ్ల గణేష్ ప్రస్తుతం గుడ్ల వ్యాపారం చూసుకొంటున్నాడు. ఇలాగే ఇంకొన్ని కేసుల్లో ఇరుక్కున్నాడంటే బండ్లతో సినిమాలు చేసేందుకు భవిష్యత్ లో ఏ ఒక్క హీరో కనీసం ఆసక్తి కూడా చూపించడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus