రాజుగారికి బండ్లన్న కోసం ఎందుకు ఇంతలా..?

  • June 10, 2019 / 05:32 PM IST

సాధారణంగా టాలీవుడ్లో ఓ హీరో డేట్ల కోసం ఓ నిర్మాత ప్రయత్నిస్తుండడం కామన్. ఇందుకు ఆ నిర్మాత తెలిసిన మరో హీరోనో లేక దర్శకుడినో వాడుకుని పలనా హీరో డేట్లను ఓకే చేయించుకుంటాడు. కానీ ఇక్కడో నిర్మాత… ఓ హీరో కాల్ షీట్ల కోసం ఓ బడా నిర్మాతని పట్టుకున్నాడు. ఇక్కడ ఆ బడా నిర్మాత కూడా ఈ వెనుకబడ్డ నిర్మాత కోసం సురిటీ ఇచ్చి మరీ హీరో కాల్ షీట్లు ఇప్పించడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ ఎవరా వెనుకబడ్డ నిర్మాత.. ఎవరా బడా నిర్మాత.. ఎవరా హీరో.. అనేగా మీ డౌట్..?

గతంలో పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్ తో ‘బాద్ షా’ ‘టెంపర్’, రాంచరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’, అల్లు అర్జున్ తో ‘గోవిందుడు అందరి వాడేలే’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్. ‘టెంపర్’ సినిమా టైములో ఎన్టీఆర్, సచిన్ జోషి లతో కొన్ని వివాదాల కారణంగా నిర్మాణ రంగానికి దూరమయ్యాడు. తరువాత రాజకీయాల్లోకి వెళ్ళి.. అక్కడ కూడా తనెంత మంచి కమెడియన్ అనేది ప్రూవ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు సినిమాల వైపు దృష్టి పెట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించబోతున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. ఇక మరో వైపు తనో చిత్రాన్ని నిర్మించడానికి కూడా తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు బడా నిర్మాత దిల్ రాజు హెల్ప్ తీసుకుంటున్నాడు. దిల్ రాజు కూడా బండ్ల కోసం నాని ని రిక్వెస్ట్ చేస్తున్నాడట. అంతేకాదు నాది హామీ అనే రేంజ్లో నాని ని కన్వెన్స్ చేస్తున్నాడట దిల్ రాజు. ఇందులో దిల్ రాజు కి కలిసొచ్చేదేముందని ఇంతలా బండ్లకు హెల్ప్ చేస్తున్నాడు… అనేది ఫిలింనగర్లో చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus