Bandla Ganesh: బండ్ల గణేష్ మాటలపై అభిమానుల ఆగ్రహం!

సినిమా ఈవెంట్స్ లో బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆయన స్పీచ్ కోసమే చాలా మంది గెస్ట్ గా పిలుస్తుంటారు. మొన్నామధ్య ఆకాష్ పూరి నటించిన ‘చోర్ బజార్’ సినిమా ఫంక్షన్ లో ఆకాష్ తండ్రి, దర్శకుడు పూరి జగన్నాధ్ మీద చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ అయ్యాయో తెలిసిందే. ఇదివరకు బండ్ల గణేష్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్ లోనే కనిపించేవారు.

కానీ మెల్లగా ఇతర హీరోల సినిమా ఫంక్షన్స్ కి కూడా హాజరవుతున్నారు. రీసెంట్ గా రవితేజ నటించిన ‘ధమాకా’ సినిమా సక్సెస్ మీట్ కి అతిథిగా వచ్చారు బండ్ల గణేష్. స్టేజ్ ఎక్కిన బండ్ల గణేష్.. రవితేజను పొగుడుతూ గొప్పగా మాట్లాడారు. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చాడని రవితేజకి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. నిర్మాతగా బండ్ల గణేష్ కి మొదటి అవకాశం ఇచ్చింది రవితేజే. అందుకే ఆయనపై ప్రేమను కురిపించారు.

అక్కడితో ఆగకుండా.. ఎవరైనా సరే అదృష్టం ఉంటే సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయిపోతారని చెప్పడంతో ఇది కాస్తా వేరే అర్థంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో చిరంజీవి, మహేష్ బాబు అభిమానులు బండ్ల గణేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్కు ఉంటే ఆఫర్లు రావొచ్చేమో కానీ స్టార్లు ఎలా అవుతారని బండ్ల గణేష్ ని ప్రశ్నిస్తున్నారు. బండ్ల గణేష్ ఉద్దేశం ఏదైనా కానీ.. హీరోల బిరుదులు వాడడంతో సమస్య తలెత్తింది.

అసలే ఏమైనా దొరికితే ట్రోల్ చేయడానికి రెడీగా ఉండే ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయారు బండ్ల గణేష్. ఇదే స్పీచ్ లో ఆయన ఒకట్రెండు చోట్ల బూతులు మాట్లాడడం కూడా ట్రోల్ అవుతుంది. తన స్పీచ్ తో అదరగొట్టేయాలనుకున్న బండ్ల గణేష్ ఇప్పుడు ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యారు. ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే నిర్మాతగా సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు కానీ ప్రాజెక్ట్ సెట్ కావడం లేదు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus