Bandla Ganesh: లక్షలు ఖర్చుచేసి టపాసులు కొన్న బండ్ల గణేష్?

దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే చిన్న పెద్ద పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు డబ్బు ఖర్చు చేసే టపాకులను పేలుస్తూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ సైతం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి టపాకులను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ తాను టపాసులు కొన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ దీపావళి పండుగను పురస్కరించుకొని ఏకంగా నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి టపాసులు కొన్నట్టు తెలుస్తోంది.ఏ విషయంలోనైనా ఎంతో ప్రత్యేకత చూపించే బండ్ల గణేష్ దీపావళి పండుగను పురస్కరించుకొని టపాకులను సైతం ఏకంగా నాలుగు లక్షల ఖర్చు చేసి కొనుగోలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా నాలుగు లక్షల రూపాయల టపాసులను కొనుగోలు చేసి వాటి ముందు కూర్చోని ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో

ఎంతోమంది అభిమానులు ఊరు మొత్తం కాల్చేటపాసులు అన్ని మీరే కొనుగోలు చేశారు కదా బండ్లన్న ఎంతైనా మీరు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈయన పట్ల విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బండ్ల గణేష్ నాలుగు లక్షల రూపాయలు కొనుగోలు చేసి టపాకులు కొన్నది తనకు మాత్రమే కాదని తన స్నేహితులు బంధుమిత్రులకు సినీ సెలెబ్రిటీలకు ఈయన బహుమతిగా టపాకులను పంపించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నాలుగు లక్షల విలువ చేసే టపాకులకు కొనుగోలు చేయడం అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus