Bandla Ganesh: నాతో పెట్టుకుంటే మాడి మసైపోతావు!

సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ సినిమాల కన్నా కూడా సోషల్ మీడియా వేదికగా ఈయన చేసే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు ఎలాంటి వివాదాలకు కారణం అవుతాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ఈయన గురూజీ అంటూ ఒక డైరెక్టర్ ను ఉద్దేశించి చేసినటువంటి ఈ పోస్టు సంచలనగా మారింది.

ఇలా ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి (Bandla Ganesh) ఈయన ఒక వెబ్సైట్ పెట్టి తీవ్ర స్థాయిలో మండిపడుతూ చేసినటువంటి వరుస ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వెబ్సైట్ బండ్ల గణేష్ గురించి రాసిన ఆర్టికల్ ఈయన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ సదరు వెబ్ సైట్ అధినేత గురించి అలాగే ఇతర వెబ్సైట్లకు కూడా తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. అరే వెంకట్ రెడ్డి ఓ పెద్ద బ్రోకర్ మీ మూర్తి చిన్న బ్రోకర్ నీలి వార్తలు రాసుకుని నీలి బతుకులు బతుకుతూ దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫూట్ అంటూ ఫైర్ అయ్యారు.

మేము ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తాము పూజిస్తాము కోపం వస్తే అలుగుతాము. పూజించి ప్రాణాలు ఇచ్చినప్పుడు అలిగే హక్కు కూడా మాకు ఉంటుంది. బండ్ల గణేష్, సినిమా వాళ్లు సినిమా వార్తలు లేకపోతే నీకు రోజు కూడా గడవదు. కడుపుకు నువ్వు అన్నం తింటున్నట్లయితే ఒకసారి నాకు ప్రత్యక్షంగా కనపడు. నీలి చిత్రాల గురించి అలాంటి వార్తలు రాసే నువ్వు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి ముందు తెలుసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఎవరితోనైనా పెట్టుకో నిజాయితీగా ఉండే వాడి జోలికి అసలు రావద్దు.. నీతిగా బ్రతికే వారి జోలికి పోవద్దు అలాంటివాళ్ల జోలికి వెళ్తే మాడి మసైపోతావు ఈ విషయాన్ని గుర్తించుకో అంటూ ఈయన వరుసగా ట్వీట్స్ చేశారు. అంతేకాకుండా ఇలాంటి కొన్ని వెబ్సైట్లకు ఏ ఒక్క సినీ సెలబ్రిటీ కూడా ఇంటర్వ్యూలో ఇవ్వద్దని ఈయన పలువురు సెలబ్రిటీలకు సలహాలు సూచనలు కూడా చేశారు. ఇలా సదరు వెబ్సైట్ గురించి ఆ వెబ్సైట్ అధినేత గురించి బండ్ల గణేష్ ఈ స్థాయిలో మండిపడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus