పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో… బండ్ల గణేష్ నిర్మాణంలో రూపొందిన సినిమా ‘తీన్ మార్’. హిందీలో సూపర్ హిట్ అయిన ‘లవ్ ఆజ్ కల్’ కు రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన పాత్రలు పోషించాడు. అర్జున్ పాల్ వాయ్ గా సంప్రదాయాలు ఫాలో అయ్యే వ్యక్తిగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర ఒకటైతే.. పాష్ గా ఉండే మైకేల్ వేలాయుధం అనే ప్రజెంట్ జెనెరేషన్ కు తగ్గ పాత్ర మరొకటి.
అర్జున్ పాల్ వాయ్ పాత్రకి కృతి కర్బంద, మైకేల్ వేలాయుధం పాత్రకి త్రిష హీరోయిన్లుగా నటించారు.మణిశర్మ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ చిత్రం క్లైమాక్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ క్లైమాక్స్ కు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత ఈజీగా మైండ్ లో నుండీ పోదు. 2011 వ సంవత్సరం ఏప్రిల్ 14న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.
నేతితో ఈ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. చెప్పుకోవడానికి పైన చెప్పుకున్న హైలెట్స్ అన్నీ ఉన్నప్పటికీ ఈ మూవీ సక్సెస్ కాలేకపోయింది. దానికి ప్రధాన కారణం స్లో నేరేషన్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన పాత్రకి డబ్బింగ్ కూడా చెప్పుకోకుండా ఏదో ప్రయోగం చేసాడు. అది మరింతగా ఫెయిల్ అయ్యింది. ఇదే మూవీని త్రివిక్రమ్ కనుక డైరెక్ట్ చేసి ఉంటే కచ్చితంగా సూపర్ హిట్ అయ్యుండేది అంటూ నిర్మాత బండ్ల గణేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.
త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ – మాటలు అందించాడు. ఇతన్నే డైరెక్టర్ గా వాడుకుని ఉండి ఉంటే సినిమా హిట్ అయ్యేది తన బాస్ తో తీసిన మొదటి మూవీ ప్లాప్ అవ్వకుండా గట్టెక్కేది అంటూ బండ్ల గణేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. అయితే ఈ మూవీ ప్లాప్ అయ్యింది కదా అని.. అతనికి ‘గబ్బర్ సింగ్’ అవకాశం ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!