నందమూరి తారకరత్న మరణించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇలా తారకరత్న మరణించడంతో ఎంతో మంది సినీ రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి తారకరత్న మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి దగ్గర బంధుత్వం ఉండడంతో విజయసాయిరెడ్డి అక్కడే ఉంటూ అన్ని తానై చూసుకుంటున్నారు. ఇలా అక్కడికి వచ్చిన వారందరికీ ఈయన సాదరంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నారు.ఈ క్రమంలోనే తారకరత్నకు నివాళులు అర్పించడం కోసం చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు.
చంద్రబాబు నాయుడు తారకరత్నకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడే ఉన్నటు వంటి విజయసాయిరెడ్డితో కలిసి కాసేపు మాట్లాడారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటో పై బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ స్పందిస్తూ నా ప్రాణం పోయినా శత్రువుతో ఎప్పటికీ ఇలాంటి పని చేయను. అవసరమనుకుంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతా ఇది నా నైజం.
ప్రజలలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బ్రతికినన్నాళ్లు సింహంలా బ్రతకాలి చనిపోయిన సింహంలా చావాలి అంటూ ఈయన ట్వీట్ చేశారు. దీంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇది చూసినటువంటి కొందరు నెటిజెన్స్ పెద్ద ఎత్తున బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సందర్భాలలో శత్రుత్వాన్ని కూడా పక్కనపెట్టి వస్తారు అలాంటిది
మీరు కనీసం మానవత్వం లేకుండా ఇలాంటి సమయంలో ఈ విధంగా మాట్లాడటానికి కాస్తయినా సంస్కారం ఉండాలి అంటూ మండిపడుతున్నారు. అలాగే మరికొందరు స్పందిస్తూ బండ్ల గణేష్ కాస్త నీ పిచ్చి ట్వీట్లు ఆపు… ఈ పరిస్థితులలో కూడా నువ్వు రాజకీయంగా ఆలోచించకు మానవత్వం ఉన్న ఒక మనిషిలా ఆలోచించు అంటూ తీవ్రస్థాయిలో బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్నారు.