మహేష్ చిత్రంతో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బండ్ల గణేష్..!

  • April 18, 2019 / 01:33 PM IST

చిన్న చిన్న కామెడీ పత్రాలు చేస్తూ.. ఒకేసారి బడా నిర్మాత అవతారమెత్తాడు బండ్ల గణేష్. రవితేజతో ‘ఆంజనేయులు’ పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ జూ.ఎన్టీఆర్ తో ‘బాద్ షా’ ‘టెంపర్’ రాంచరణ్ తో ‘గోవిందుడు అందరి వాడేలే’ వంటి బడా చిత్రాల్ని నిర్మించాడు బండ్ల గణేష్. అయితే పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ జపం ఎక్కువ చేయడం వాళ్ళనుకుంటాను ప్రభాస్, మహేష్ లాంటి హీరోలు బండ్ల గణేష్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అంతే కాదు ఏ హీరో కూడా బండ్ల గణేష్ తో చేయడానికి ముందుకు రాలేదు. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ పై కూడా చేసిన కామెంట్స్ అయన ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. ఇక నిర్మాతగా వర్కౌట్ అవ్వదు అనుకున్నాడేమో… రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుందామని రంగంలోకి దిగాడు. గతేడాది జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరి… ఆ పార్టీకి ఓ రేంజ్లో ప్రచారం చేసినా పాపం బండ్లన్నకు ఏమీ దక్కలేదు.

‘7’ఓ’ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటాను’ అనే డైలాగుతో తీవ్ర విమర్శలెదుర్కొన్నాడు. ఇటీవల పాలిటిక్స్ కు గుడ్ బై చెప్తున్నట్టు కూడా ఓ లేక రాసాడు. ఇకఅసలు మ్యాటర్ ఏంటంటే.. ఓ పక్క బిజినెస్ చూసుకుంటూ ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ అవ్వాలని బండ్ల గణేష్ ప్రయత్నాలు చేస్తున్నాడట. నిర్మాతగా మారిన తరువాత నటనను పక్కనెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. బండ్ల గణేష్ చివరిగా మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’ చిత్రంలో నటించాడు. ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు చిత్రంతోనే మళ్ళీ యాక్టింగ్లోకి దిగాలనుకుంటున్నాడట. మహేష్.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోయే చిత్రంలో బండ్ల గణేష్ ఓ స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత అమీర్ రావిపూడి డైరెక్షన్ లో కనిపించబోతున్నాడని సమాచారం. మరి ఈసారి తన నటనతో ఎంతవరకూ ప్రేక్షకులని మెప్పిస్తాడో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus