“తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో గనుక కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే నేను బ్లేడ్ తో పీక కోసుకుంటా” అంటూ బండ్ల గణేష్ కొన్ని టీవి చానల్స్ మరియు యూట్యూబ్ చానల్స్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ ని జనాలు భీభత్సంగా ఎంజాయ్ చేశారు. బండ్ల గణేష్ ను పోలిటికల్ కమెడియన్ గా భావించారో ఏమో కానీ.. తెలంగాణ లీడర్స్ ఎవరూ కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. అయితే.. నిన్న రిజల్ట్స్ లో కాంగ్రెస్ గెలవడం కాదు కదా దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. టి.ఆర్.ఎస్ రికార్డ్ స్థాయి మెజారిటీతో గెలిచింది. దాంతో ఇప్పుడు ప్రజలందరి దృష్టి బండ్ల గణేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ మీదకు మళ్ళింది.
నిన్న ఉదయం నుంచీ బండ్ల గణేష్ మీడియాకి దొరక్కుండా తిరుగుతున్నాడు. ఆయన అభిమానులు కొందరు ఇంటికి బ్లేడ్లు పంపిస్తుండగా.. ఒక రిపోర్టర్ అయితే ఏకంగా బ్లేడ్ పట్టుకొని ఆయన ఇంటి ముందు నిల్చోవడం హాస్యాస్పదంగా మారింది. ఎలక్షన్స్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న నాయకులే సిగ్గులేకుండా రాజకీయాల్లో తిరుగుతున్నారు. అలాంటప్పుడు బండ్ల గణేష్ స్టేట్ మెంట్స్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు. కానీ.. నెటిజన్లు మాత్రం బండ్ల పీక కోసుకుంటాడా లేదా? అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఏదో ఒకటి చేసి బండ్ల గణేష్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయితే తప్ప ఈ హడావుడి తగ్గేలా లేదు.