‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలయ్యింది.సినిమాకి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.
కానీ వీక్ డేస్ మొదలయ్యాక ‘బంగార్రాజు’ స్లో అయ్యాడు. నైజాంలో అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనీసం లేవనే చెప్పాలి. ఒకసారి 10 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 7.97 cr |
సీడెడ్ | 7.03 cr |
ఉత్తరాంధ్ర | 4.62 cr |
ఈస్ట్ | 3.82 cr |
వెస్ట్ | 2.72 cr |
గుంటూరు | 3.20 cr |
కృష్ణా | 2.08 cr |
నెల్లూరు | 1.78 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 33.22 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.10 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 36.32 cr |
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.36.32 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.68 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న ఆదివారం నాడు ఈ చిత్రం బాగానే రాణించింది. ఆంధ్రాలో 50 ఆక్యుపెన్సీ అలాగే కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ‘బంగార్రాజు’ ఓపెనింగ్స్ డల్ అయినట్టు స్పష్టమవుతుంది. అయితే పోటీగా క్రేజ్ ఉన్న సినిమాలు లేవు కాబట్టి.. బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ‘బంగార్రాజు’ కి అవకాశాలు ఉన్నాయి. నైజాం మాత్రం వర్కౌట్ అవ్వకపోవచ్చు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!