‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలయ్యింది.కాస్త రొటీన్ గా అనిపించినా మొత్తానికి బాగానే ఉంది అనే టాక్ ను ఈ చిత్రం రాబట్టుకుంది.కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది.
టికెట్ రేట్లు తక్కువగా ఉన్న ఆంధ్ర వంటి ఏరియాల్లో ఈ చిత్రం సాలిడ్ గా కలెక్ట్ చేస్తుంది.అయితే నైజాంలో మాత్రం ఈ చిత్రం ఆశించిన మేర కలెక్ట్ చేయలేకపోతోంది. ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం
7.67 cr
సీడెడ్
6.68 cr
ఉత్తరాంధ్ర
4.26 cr
ఈస్ట్
3.54 cr
వెస్ట్
2.56 cr
గుంటూరు
3.02 cr
కృష్ణా
1.94 cr
నెల్లూరు
1.66 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
31.33 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
2.95 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
34.30 cr
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.34.3 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.4.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. గురువారం రోజున కూడా ఈ చిత్రం 0.50 కోట్లకి పైగా షేర్ ను రాబట్టి సూపర్ అనిపించింది. అయితే నైజాంలో మాత్రం ఈ చిత్రం పెర్ఫార్మ్ చాలా దారుణంగా ఉంది.
అక్కడ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు అక్కడ రూ.7.67 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. నిన్న మరీ ఘోరంగా రూ.6 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ వీకెండ్ ను కనుక క్యాష్ చేసుకోకపోతే అక్కడ భారీ నష్టాలు రావడం ఖాయమనే చెప్పాలి.