Beast Collections: తెలుగులో ప్లాప్ గా మిగిలిన విజయ్ ‘బీస్ట్’..!

  • April 23, 2022 / 07:36 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీ.. ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు అన్ని భాషల్లోనూ విడుదలయ్యింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించాడు. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధిమారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేశారు. దాంతో మొదటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click Here To Watch NOW

కానీ తొలి రోజు ఈ మూవీక నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుండీ బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. పోటీగా ‘కె.జి.ఎఫ్2’ ఉండడం మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ ఫీవర్ కూడా ఇంకా తగ్గకపోవడంతో ‘బీస్ట్’ నిలదొక్కుకోలేకపోయింది.

ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.45 cr
సీడెడ్ 1.10 cr
ఉత్తరాంధ్ర 0.90 cr
ఈస్ట్ 0.63 cr
వెస్ట్ 0.62 cr
గుంటూరు 0.80 cr
కృష్ణా 0.52 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.42 cr

‘బీస్ట్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.7.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బిజినెస్ మీద రూ.3.26 కోట్ల నష్టాలను మిగిల్చింది. ‘అదిరింది’ ‘సర్కార్’ ‘విజిల్’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో హిట్ అయ్యాయి.

తెలుగులో వరుస హిట్లతో మార్కెట్ పెంచుకుంటున్న టైములో విజయ్ కు ‘బీస్ట్’ బ్రేకులేసినట్టు స్పష్టమవుతుంది. మొదటి రోజు దూకుడుని వీకెండ్ అంతా చూపించినట్టు అయితే ‘మాస్టర్’ లానే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ ‘కె.జి.ఎఫ్2’ ‘ఆర్.ఆర్.ఆర్’ ల వల్ల అది కుదరలేదు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus