Beast Tickets: ‘బీస్ట్‌’ టికెట్‌ రేట్ల విషయంలో ఈ పాయింట్‌ చూశారా?

విడుదలైన తొలి రోజుల్లో సినిమా టికెట్‌ ధరలు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలాగా ఎలాంటి ఆంక్షలు, లాజిక్‌లు పెట్టలేదు. దీంతో సినిమా పరిశ్రమ మీద ఎంత ప్రేమో అంటూ… అందరూ మెచ్చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ కాస్త ప్రేక్షకుల మీద పగలా మారిందా? ‘బీస్ట్‌’ సినిమా టికెట్‌ ధరల లెక్క చూస్తే అదే అనిపిస్తోంది. కావాలంటే బీస్ట్‌ టికెట్‌ కోసం ఆన్‌లైన్‌ ప్లేస్‌లు మార్చి వెతికి చూడండి మీకే అసలు విషయం అర్థమవుతుంది.

Click Here To Watch Trailer

విజయ్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూపొందించిన ‘బీస్ట్‌’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్‌ సినిమాను చూద్దాం అనుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు రూ. 100 వరకు ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సింగిల్‌ థియేటర్ల లెక్క పక్కన పెడితే… మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్‌ ధరలు అమాంతం పెంచేశారు. అయితే ఆ ధరలు ప్రభుత్వం నిర్ణయించినవే. కానీ ఓ తమిళ డబ్బింగ్‌ సినిమాకు టికెట్‌ ధర తమిళనాడు కంటే ఎక్కువ ఉండటం అంటే.. ఆలోచించాల్సిన విషయమే కదా.

ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘బీస్ట్‌’ సినిమా టికెట్‌ ధరలు ఇలా ఉన్నాయి అంటూ ఓ ఇమేజ్‌ వైరల్‌ అవుతోంది. దాని లెక్క ప్రకారం చూస్తే ‘బీస్ట్‌’ సినిమాను మల్టీప్లెక్స్‌లో చూడటానికి తమిళ ప్రేక్షకులు కంటే తెలుగు ప్రేక్షకులు రూ. 100 ఎక్కువ పెట్టాల్సిందే. ఐనాక్స్‌, పీవీఆర్‌ టికెట్‌ ధరలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆ ట్వీట్‌ను రాసుకొచ్చారు. చెన్నై పీవీఆర్‌లో టికెట్‌ ధర రూ. 190.78 పడుతోంది.

అదే హైదరాబాద్‌లో పీవీఆర్‌లో అయితే రూ. 295 కట్టాల్సిందే. ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లోనూ ఇదే పరిస్థితి. టికెట్‌ రేట్లు పెంచుకోమని ప్రభుత్వం చెప్పడం ఓకే, అయితే ప్రేక్షకులు ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. సరైన నియంత్రణ లేకుండా టికెట్‌ రేట్లు పెడితే ఇలానే ఉంటుందని ప్రభుత్వాలు, సినిమా వాళ్లు ఆలోచించుకోవాలి. అయినా ప్రేక్షకుల బాధల్ని పట్టించుకున్న సినిమా వాళ్లు ఎక్కడున్నారులెండి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus