Bedurulanka2012 Teaser Review: కార్తికేయ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..!

ఆర్.ఎక్స్.100 హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012 . నూతన దర్శకుడు క్లాక్స్.. ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తుండగా.. సి.యువరాజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు . దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చ్ లో విడుదలకి సిద్ధమవుతుంది . ఇక మొన్నామధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అలాగే గ్లింప్స్ కు మంచి స్పందన లభించింది.

ఈ క్రమంలో తాజాగా టీజర్ ను కూడా విడుదల చేశారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ బెదురులంక టీజర్ ను లాంచ్ చేసారు. ఇక టీజర్ ను బట్టి ఈ చిత్రం కథ 2012 నేపథ్యంలో సాగుతుంది అని స్పష్టమవుతుంది. 2012 డిసెంబర్ 21 న ప్రపంచం అంతమైపోతుంది అంటూ చాలా కథనాలు పుట్టుకొచ్చాయి . దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. 2012 డిసెంబర్ 21 యుగాంతం అంటూ సినిమాలు కూడా వచ్చాయి.

అయితే ఆ టైంలో గోదావరి జిల్లాలకు చెందిన జనాలు ఎలాంటి భయాందోళనకు గురయ్యారు.. అనే థీమ్ తో పక్కా కామెడీ మూవీగా బెదురులంక రూపిందినట్టు తెలుస్తుంది. హీరో కార్తికేయ అలాగే నేహా శెట్టి ల లవ్ ట్రాక్, మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం, అజయ్ ఘోష్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని టీజర్ ద్వారా స్పష్టమవుతుంది. టీజర్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి:


రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus