మన తారలు టాలీవుడ్ కు రాకముందు!

  • October 24, 2016 / 12:37 PM IST

మన టాలీవుడ్ నటీనటుల్లో చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించేందుకు చాలా కష్టాలే పడ్డారు. అయితే కొందరికి సినిమా పరిశ్రమ ఎర్ర తివాచీ పరిస్తే, మరికొందరు ఎన్నో ముళ్ళ కంచెలు దాటుకుని వచ్చి మరీ ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. మరికొందరు అయితే, సినిమాపై ఉన్న పిచ్చి, అభిమానం, ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే వ్యామోహంతో సినిమా పరిశ్రమలు రెక్కలు కట్టుకుని వాలీ పోయారు. మరి అలా సినిమా పరిశ్రమంలో ప్రవేశించి తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో టాలీవుడ్ కు రాక ముందు వారు ఏం చేసేవారో ఒక్కసారి లుక్ వేద్దాం రండి..

ప్రిన్స్ మహేష్ బాబుఈ యువ హీరో, చెన్నైలో లొయొలా కాలేజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే 1999లో రాజకుమారుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పనిచేసాడు. 1998లో అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ఈ కుర్ర హీరో భీమవరంలో ఇంటర్మీడియేట్ పూర్తి చేసి తెలుగులో హీరోలోగా ఈశ్వర్ సినిమాతో ప్రవేశించాడు. ఇక ఆ తరువాత మెల్లగా సినిమాలు చేస్తుంటే 2012లో కాస్త లేట్ గా బీటెక్ పూర్తి చేశాడు.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్చెన్నైలోనే చదువుకున్న రామ్‌చరణ్ సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు.

గోపిచంద్ప్రముఖ ఛానెల్ ఈటీవీలో న్యూస్ రీడర్ గా పనిచేసిన మన యువ హీరో గోపిచంద్, 2001లో ‘తొలివలపు’ చిత్రంతో తెలుగులో హీరోగా ఎంటర్ అయ్యాడు.

న్యాచురల్ స్టార్ నానిభలే భలే మగాడివోయ్ అంటూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్న నాని, సినిమాల్లోకి రాకముందు విశాఖపట్టణంలో రేడియో జాకీగా పనిచేసాడు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు1974లో కన్నవారి కలలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మోహన్ బాబు, ఫిజికల్ ఎజుకేషన్ టీచర్ గా పనిచేశారు.

పద్మశ్రీ బ్రహ్మానందంకామెడీయన్ గా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బ్రహ్మీ…సినిమాల్లోకి రాకముందు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో టీచర్ గా పనిచేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus