ఓంకార్ దర్శకత్వంలో నటించనున్న బెల్లంకొండ శ్రీనివాస్

బుల్లితెరపై ఆట, ఛాలెంజ్ వంటి రియాలిటీ షోలతో పాపులర్ అయిన ఓంకార్ మెగా ఫోన్ పట్టి జీనియస్ అనే చిత్రాన్ని తీశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత మంచి హారర్ కామెడీ స్క్రిప్ట్ రాసుకొని రాజుగారి గది సినిమా తీశారు. ఇది అతన్ని సినీ రంగంలో నిలబెట్టింది. ఆ తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ గా నాగార్జునతో రాజుగారి గది 2 తెరకెక్కించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు మరో సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ఖరారు అయ్యారు. ఈ యువ హీరో జయ జానకి నాయక చిత్రం ద్వారా యాక్షన్ హీరోగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత సాక్ష్యం సినిమా చేస్తున్నారు.

శ్రీవాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న శ్రీనివాస్ కి ఓంకార్ రీసెంట్ గా కథ చెప్పారంట. సీరియస్ కథలో కామెడీ మిక్స్ చేసే విధానం నచ్చి అతను ఒకే చెప్పారని ఫిలిం నగర్ వాసులు వెల్లడించారు. దీంతో ఓంకార్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. సాక్ష్యం సినిమా పూర్తి అయ్యేలా లోపే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలనీ పట్టుదలతో ఉన్నారు. అంతా కుదిరితే ఈ చిత్రం జూన్ లో సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. క్రీడా నేపథ్యంలో సాగే ఈ మూవీ బెల్లంకొండకు మంచి పేరుతీసుకొస్తుందని ఓంకార్ నమ్ముతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus