మాస్ మసాలా తో కుమ్ముడే..!

అల్లుడు శీను సినిమాతో అరంగేట్రం చేసి తెలుగువారింటి అల్లుడు అయిపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వెళ్లినా రాక్షసుడు సినిమా మాత్రమే బెల్లంకొండకి సాలిడ్ హిట్ ఇచ్చింది. ఈ సినిమా హిట్ ఇచ్చిన ఊపులో ఇప్పుడు మరోసారి తన ట్రేడ్ మార్క్ టైటిల్ అయిన అల్లుడు తో అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే, పక్కా మాస్ మాసాలా గ్యారెంటీగానే కనిపిస్తోంది. రీసంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

దీంతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే అంటున్నారు. ఈ సినిమాతో సంతోష్ శ్రీనివాస్ కి ఖచ్చితంగా బ్రేక్ వస్తుందని చెప్తున్నారు. లాస్ట్ టైమ్ కందిరీగ , రభస, హైబర్ సినిమాల్లాగానే ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ ఫన్ ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది. అంతేకాదు, ఒకవైపు యాక్షన్ మరోవైపు ఫన్ తో ఈసారి డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తన మార్క్ ని చూపిస్తున్నట్లుగానే ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. సినిమాలో అల్లుడు బెల్లంకొండతో చేయించబోయే ఫన్ అద్దిరిపోయేలాగానే కనిపిస్తోంది. ఈ సీజన్ సంక్రాంతికి థియేటర్స్ దద్దరిల్లిపోవడం పక్కా అనే అంటున్నారు అందరూ.

దమ్మున్న సినిమా చేశాడని, దమ్మున్న అల్లుడు పండక్కి వస్తున్నాడు కాస్కోండి అని చెప్తోంది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో ఫైట్స్, సాంగ్స్, ఎంటర్ టైన్మెంట్ తో పక్కా కమర్షియల్ హంగులు ఉంటాయని అందుకే ఖచ్చితంగా సూపర్ హిట్ సాధిస్తుందని మూవీ టీమ్ చెప్తోంది. అంతేకాదు, సందడి సందడిగా జరిగిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం, అలాగే జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్స్ కూడా సినిమాకి మంచి హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. మరి అల్లుడు ఈసారి సంక్రాంతికి ఎలాంటి హిట్ సాధిస్తాడు అనేది చూడాలి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus