Bellamkonda Sreenivas: నార్త్ లో మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే క్రేజీ హీరోగా మారిపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, డాన్స్ లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగల సమర్ధుడు శ్రీనివాస్. ‘అల్లుడు శీను’ ‘జయ జానకి నాయక’ ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఇతను.. ఆ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లతో యూట్యూబ్ లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టి రికార్డులు నార్త్ లో భీభత్సమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఇటీవల ‘జయ జానకి నాయక’ చిత్రం 700 కి పైగా మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. నార్త్ లో శ్రీనివాస్ క్రేజ్ చూసి ఇంప్రెస్ అయిపోయిన ‘పెన్ స్టూడియోస్’ సంస్థ అతన్ని హిందీలో లాంచ్ చేయడానికి ముందుకొచ్చింది. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్.. నార్త్ లో లాంచ్ అవుతున్నాడు. ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.65 కోట్లకు అమ్ముడయ్యాయట.

ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చిన మొత్తంతోనే సినిమా షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారట నిర్మాతలు. ఇక థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చేదంతా లాభమే అన్నమాట. అందుకే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. దర్శకుడు వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని ఒరిజినల్ కంటే కూడా చాలా బాగా చిత్రీకరించాడట. ఇక ఇంకో విషయం ఏంటంటే..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) మార్కెట్ కు, అతని పనితనానికి మెచ్చి మరో 3 సినిమాలు అతనితో నిర్మించడానికి రెడీ అయ్యిందట ‘పెన్ స్టూడియోస్’ సంస్థ. సౌత్ హీరోల్లో ఇలాంటి ఫీట్ సాధించిన ఏకైక హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నిలిచాడు. ఇక ‘ఛత్రపతి’ మే 12 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus