ఆఖరికి బెల్లంబాబు కూడా ఆ డైరెక్టర్ కు హ్యాండిచ్చాడట..!

టాలీవుడ్ లో అగ్రదర్శకుడిగా కొనసాగిన వారిలో శ్రీను వైట్ల కూడా ఒకడు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసి కాసుల వర్షం కురిపించేవాడు. అయితే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. అదే కామెడీ ఫార్మలాని మిగిలిన దర్శకులు కూడా ఫాలో అవుతుండడంతో.. శ్రీను వైట్ల రొటీన్ అయిపోయాడని చెప్పాలి. ఇక ఇప్పట్లో నేచురాలిటీ ఉండే సినిమాలనే ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. దీంతో ఒక్క హిట్టు కొట్టాడని అష్టకష్టాలు పడుతున్నాడు శ్రీను వైట్ల. ‘ఆగడు’ తో మొదలైన డిజాస్టర్ల లెక్క ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వరకూ కొనసాగింది. ఇప్పుడు శ్రీను వైట్లతో సినిమా చేయాలంటే.. నిర్మాతలు, హీరోలు మొహం చాటేస్తున్నారు.

అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో చాలా మంది హీరోల దగ్గరకు తిరిగి చివరికి… బెల్లంకొండ శ్రీనివాస్ ను పట్టుకున్నాడు. ఇటీవల ఓ కథని సిద్ధం చేసుకుని బెల్లంకొండ శ్రీనివాస్ కు వినిపించాడట. కథ విన్న బెల్లంకొండ ఇంకా తన డెసిషన్ ఏంటనేది చెప్పలేదట. ఇక బెల్లంకొండ రెస్పాన్స్ కోసమే శ్రీను వైట్ల వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుంది. చాలా సినిమాల తర్వాత ‘రాక్షసుడు’ తో ఓ హిట్ అందుకుని కొంత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ టైములో శ్రీనువైట్లతో సినిమా అవసరమా అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus