ఒకప్పుడు రవితేజ (Ravi Teja) సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ మూవీ. అతని మాస్ సినిమా తీసి దానికి కొంచెం మాస్ టచ్ ఇస్తే.. అది కచ్చితంగా హిట్ అయ్యేది. ఆ లిస్టులో ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger) సినిమా కూడా ఉంది. 2015 డిసెంబర్ 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సంపత్ నంది (Sampath Nandi) ఈ చిత్రానికి దర్శకుడు. రవితేజ సరసన రాశీఖన్నా (Raashi Khanna), తమన్నా (Tamannaah Bhatia) ..లు హీరోయిన్లుగా నటించారు.
మొదటి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హీరో ఎలివేషన్స్, కామెడీ, భీమ్స్ (Bheems Ceciroleo) అందించిన మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్స్. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.82 cr |
సీడెడ్ | 3.35 cr |
ఉత్తరాంధ్ర | 1.85 cr |
ఈస్ట్ | 1.42 cr |
వెస్ట్ | 1.15 cr |
గుంటూరు | 1.51 cr |
కృష్ణా | 1.22 cr |
నెల్లూరు | 0.70 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 19.02 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.17 cr |
ఓవర్సీస్ | 1.61 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 22.80 cr |
‘బెంగాల్ టైగర్’ సినిమా రూ.21.5 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.22.8 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.1.3 కోట్లు ప్రాఫిట్స్ ను అందించి డీసెంట్ సక్సెస్ అందుకుంది ఈ మూవీ.