క్యాన్సర్ తో ప్రముఖ దర్శకుడు మృతి..!

  • October 26, 2022 / 11:38 AM IST

సినీ పరిశ్రమలో గత కొంత కాలంగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నటీనటులు,దర్శకులు, నిర్మాతలు, టెక్నికల్ టీంకి చెందిన వారు లేదా వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ఎవరొకరు కన్నుమూస్తున్నారు. తాజాగా మరో దర్శకుడు కన్నుమూశాడు. దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటున్న వేళ ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు,

జాతీయ అవార్డు గ్రహీత అయిన పినాకీ చౌదరి కన్నుమూశారు.గత కొంతకాలంగా ఈయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో సోమవారం నాడు కోల్ కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. 1983 లో వచ్చిన ‘చెనా అచ్చెనా’ అనే చిత్రంతో ఈయన తన కెరీర్ ను ప్రారంభించాడు. అటు తర్వాత పలు చిత్రాలను నిర్మించి దర్శకుడిగా మారాడు.ఆయన తెరకెక్కించిన షాంఘాత్, బాలీగంజ్ కోర్ట్ చిత్రాలకు నేషనల్ అవార్డులు వరించాయి.

నటుడు, నిర్మాత, దర్శకుడిగా బెంగాలీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ఆయన కొన్నాళ్లుగా లింఫోమా, శోషరస కు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు బంధుమిత్రుల సమాచారం. ఇలాంటి సమయంలో ఆయన హాస్పిటల్ లోనే ఉండాలని డాక్టర్లు చెప్పినప్పటికీ.. చివరి రోజుల్లో తన నివాసంలో గడపాలని ఆయన కుటుంబ సభ్యులను కోరారట. దీంతో వారు పినాకీ చౌదరి ని ఇంటికి తీసుకొచ్చారు. బాగానే ఉంటున్నారు అనుకుంటున్న టైంలో ఆయనకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది రావడం,

దగ్గు కూడా ఎక్కువవడంతో ఆయన పల్స్ రేట్ పడిపోయినట్టు తెలుస్తుంది. ఈయన మరణవార్తతో బెంగాలీ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 1940 వ సంవత్సరంలో సెప్టెంబర్ 19న ఈయన జన్మించగా.. 2022 లో అక్టోబర్ 24న ఈయన మరణించారు. ఈయన వయసు 82 సంవత్సరాలు కావడం విశేషం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus