థియేటర్లలో ప్రేక్షకుల్ని ఓలలాడించిన సారధులు

1. బాబీ – వాల్తేరు వీరయ్య

చిరంజీవిని ఫ్యాన్స్ కావాలనుకున్నట్లుగా చూపించి, సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు బాబీ. నిజానికి ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్ కట్ కూడా యావరేజ్ గా ఉంది. అయితే.. మంచి మాస్ ఎలిమెంట్స్ తో సినిమాను నడిపి దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నాడు బాబీ. ముఖ్యంగా మంచి ఎమోషన్ తో ఆడియన్స్ ను కట్టిపడేసి.. సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.

2. వెంకీ అట్లూరి – సార్

వెంకీ మునుపటి చిత్రాలతో చూస్తే “సార్”తో చాలా ఇంప్రూవ్ అయ్యాడనిపిస్తుంది. ముఖ్యంగా ‘సార్” ఫస్టాఫ్ & సెకండాఫ్ కి మధ్య వ్యత్యాసం, చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించిన తీరు అతడి ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి.

3. శ్రీకాంత్ ఓడెల – దసరా

సుకుమార్ శిష్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆయన స్థాయిలోనే “దసరా” చిత్రాన్ని తెరకెక్కించి.. మాస్ డైరెక్టర్ గా తనదైన ముద్రను వేశాడు శ్రీకాంత్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ & క్లైమాక్స్ ఫైట్స్ సీక్వెన్స్ ను శ్రీకాంత్ కన్సీవ్ చేసిన విధానాన్ని మెచ్చుకోని వారు లేరు. ఇప్పుడు రెండో సినిమా కూడా నానితోనే ఎనౌన్స్ చేసి.. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు శ్రీకాంత్.

4. అనిల్ రావిపూడి – భగవంత్ కేసరి

“ఎఫ్ 3” కమర్షియల్ గా వర్కవుటయినప్పటికీ.. దర్శకుడిగా అనిల్ రావిపూడికి నెగిటివిటీ తెచ్చిపెట్టింది. ఆ లేకి కామెడీని అన్నీ వర్గాల వారూ ఆస్వారించలేకపోయారు. ఆ నెగిటివిటీని “భగవంత్ కేసరి”తో పోగొట్టుకున్నాడు అనిల్. బాలయ్య లోని మాస్ యాంగిల్ ను మాత్రమే కాక సెంటిమెంట్ యాంగిల్ ను కూడా సరిగ్గా వినియోగించుకొని తన సత్తా చాటుకున్నాడు అనిల్ రావిపూడి.

5. సాయి రాజేష్ – బేబీ

అప్పటివరకూ స్పూఫ్ సినిమాలు తీసిన సాయి రాజేష్ ను దర్శకుడిగా ఎవరూ సీరియస్ గా తీసుకొనేవారు కాదు. నిర్మాతగా “కలర్ ఫోటో” లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసినప్పటికీ.. దర్శకుడిగా తన సత్తాను మాత్రం “బేబీ”తోనే చూపించుకోగలిగాడు. ఒకప్పుడు తాను కథ చెబుతాను అంటే టైమ్ కూడా ఇవ్వని హీరోలు.. ఇప్పుడు అతడి కోసం బారులు తీరేలా చేశాడు. సాయి రాజేష్ తన తదుపరి సినిమా ఎప్పుడు ఎనౌన్స్ చేస్తాడు అనే విషయంపై మంచి ఆసక్తి నెలకొని ఉంది.

6. కార్తీక్ వర్మ దండు – విరూపాక్ష

“భమ్ భోలేనాధ్”తో దర్శకుడిగా పరిచయమై.. దాదాపు ఎనిమిదేళ్ళ గ్యాప్ తీసుకొని దర్శకుడిగా “విరూపాక్ష”తో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు కార్తీక్ వర్మ దండు. స్క్రీన్ ప్లే విషయంలో సుకుమార్ హెల్ప్ తీసుకున్నప్పటికీ.. దర్శకుడిగా తన మార్క్ ను మాత్రం బలంగా వేశాడు కార్తీక్. కొన్ని హారర్ సీన్స్ & క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం హర్షణీయం.

7. వేణు – బలగం

అసలు వేణు దర్శకత్వం చేయగలడని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. కానీ.. “బలగం” సినిమాలో అతడు అద్భుతమైన ఎమోషన్స్ ను పండించిన తీరు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఒక కుటుంబంలోని అన్నీ బంధుత్వాలను చాలా చక్కగా డీల్ చేశాడు. ఇప్పుడు నానితో రెండో సినిమా అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో, వేణు సెకండ్ సినిమా సిండ్రోమ్ బారిన పడకుండా తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంటాడా లేదా అనేది చూడాలి.

8. నందిని రెడ్డి – అన్నీ మంచి శకునములే

నవతరం దర్శకుల్లో ఎమోషన్స్ ను హృద్యంగా డీల్ చేయగలిగే అతికొద్ది మంది దర్శకుల్లో నందిని రెడ్డి ఒకరు. ఆమె తెరకెక్కించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. సదరు సినిమాల్లో పండించిన ఎమోషన్స్ మాత్రం కోకొల్లలు. అందుకు సరికొత్త ఉదాహరణ “అన్నీ మంచి శకునములే”. చాలా సాధారణమైన కథే అయినప్పటికీ.. సినిమాలోని పాత్రలను, క్లైమాక్స్ లో ఎమోషన్స్ ను ఆమె డీల్ చేసిన విధానం దర్శకురాలిగా ఆమె సత్తాను చాటింది.

9. రామ్ అబ్బరాజు – సామజవరగమన

మోస్ట్ సర్ప్రైజింగ్ సినిమా ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సామజవరగమన” మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. శ్రీవిష్ణు-నరేశ్ నడుమ నడిపిన తండ్రీకొడుకుల కెమిస్ట్రీ & ఆరోగ్యకరమైన హాస్యానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

10. మహేష్ బాబు – మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

సినిమా ఎనౌన్స్ చేసిన చాలా కాలం వరకూ షూటింగ్ మొదలవ్వకపోయేసరికి.. అందరూ సినిమా ఆగిపోయిందనుకునే స్టేజ్ నుంచి.. సూపర్ హిట్ కొట్టిన స్టేజ్ దాకా చేరుకున్న మహేష్ బాబు నవతరం దర్శకులకు ఒక మంచి ఉదాహరణగా నిలిచాడు. ఒక బోల్డ్ కాన్సెప్ట్ ను ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా.. చక్కని హాస్యం & ఎమోషన్స్ తో నడిపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

11. కళ్యాణ్ శంకర్ – మ్యాడ్

ఈ ఏడాది హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేసిన ఏకైక సినిమా “మ్యాడ్”. ఎక్కడా లాజిక్స్ తో సంబంధం లేకుండా కేవలం పంచ్ డైలాగులు & కామెడీ సీక్వెన్సులతో సినిమా మొత్తాన్ని నడిపి.. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టించకుండా బంపర్ హిట్ కొట్టేశాడు

12. అజయ్ భూపతి – మంగళవారం

“ఆర్ ఎక్స్ 100” తర్వాత “మహా సముద్రం”తో ఫ్లాప్ చవిచూసి.. ఒన్ టైమ్ వండర్ గా మిగిలిపోతాడనుకున్న అజయ్ భూపతి.. తన లేడీ లక్కైన పాయల్ తో తెరకెక్కించిన “మంగళవారం”తో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.

13. తేజ మార్ని – కోట బొమ్మాళీ

“నాయట్టు” అనే మలయాళ సినిమాను “కోట బొమ్మాళీ”గా రీమేక్ చేసినప్పటికీ.. ఆ రీమేక్ లో మంచి కమర్షియల్ మార్పులు చేసి దర్శకుడిగా తనదైన మార్క్ వేశాడు తేజ మార్ని. ముఖ్యంగా శ్రీకాంత్ పాత్రకు అతడు చేసిన మార్పులు & ఆ పాత్రను డిజైన్ చేసిన తీరుకు మంచి స్పందన వచ్చింది.

14. శౌర్యు – హాయ్ నాన్న

యాక్షన్, కామెడీ, సస్పెన్స్ సినిమాలతో బోర్ కొట్టేసిన తెలుగు ప్రేక్షకులకు చాన్నాళ్ల తర్వాత మంచి డ్రామా రుచి చూపించాడు దర్శకుడు శౌర్యు. ఇదివరకే చూసేసిన కతలోనే మంచి ఎమోషన్ & డ్రామా కలగలిపి “హాయ్ నాన్న”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగలిగాడు.

15. ప్రశాంత్ నీల్ – సలార్

లాస్ట్ లో వచ్చి 2023 బెస్ట్ కమర్షియల్ హిట్ కొట్టాడు (Prashanth Neel)ప్రశాంత్ నీల్. ప్రభాస్ ను సరిగ్గా వినియోగించుకోవడమే కాక.. సీక్వెల్ కు కావాల్సిన చక్కని లీడ్ ను ఇచ్చి “సలార్ 2″కి ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ చేశాడు. తన మొదటి సినిమానే మళ్ళీ తీసినా.. దర్శకుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus