Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 4, 2026 / 11:56 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నివిన్ పౌలి (Hero)
  • మమితా బైజు (Heroine)
  • వినయ్ ఫోర్ట్, శ్రీన్దా,సురేష్ కృష్ణ, బిందు పాణికర్, సంగీత్ ప్రతాప్, మీనాక్షి రవీంద్రన్, షామీర్ ఖాన్ తదితరులు (Cast)
  • గిరీష్ ఎ డి (Director)
  • దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్,శ్యామ్ పుష్కరన్ (Producer)
  • విష్ణు విజయ్ (Music)
  • అజ్మల్ సబు (Cinematography)
  • ఆకాష్ జోసెఫ్ వర్గీస్ (Editor)
  • Release Date : 4th సెప్టెంబర్ 2026
  • భావన స్టూడియోస్, వర్కింగ్ క్లాస్ హీరో, ఫహాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ (Banner)

మలయాళం సినిమాలకి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. రాను రాను ఆ డిమాండ్ మరింతగా పెరుగుతుంది. దానిని గుర్తించిన మన టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మలయాళం సినిమాలని డబ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందుండేది ‘మైత్రి..’ వారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంటెంట్ ఉన్న మలయాళం సినిమాలని ఏరి కోరి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగా గతవారం మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ (Bethlehem Kudumba Unit) సినిమాని తెలుగులో డబ్ చేసి ఈ వారం రిలీజ్ చేస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉందా? తెలుసుకుందాం రండి:

Bethlehem Kudumba Unit Movie Review

Bethlehem Kudumba Unit Movie Review And Rating

కథ: జస్టిన్ (Nivin Pauly) కేటరింగ్ బిజినెస్ నడుపుకునే వ్యక్తి. పెళ్ళీడు దాటిపోయినప్పటికీ అసలు ఆ విషయాన్నే పట్టించుకోకుండా తన ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు. తమ్ముడు జోయెల్(సంగీత్ ప్రతాప్) అండ్ ఫ్రెండ్స్ జస్టిన్ బ్యాచిలర్ లైఫ్ పై సెటైర్లు వేసినా పట్టించుకోడు. జస్టిన్ తమ్ముడు జోయెల్ (సంగీత్ ప్రతాప్) షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటాడు. అలాగే సాయూజ్య(పార్వతీ అయ్యప్పదాస్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అదే అమ్మాయిని తన షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా పెట్టుకుంటూ లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. అలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఆశ్లే (Mamitha Baiju) ఎంట్రీ ఇస్తుంది. వీరి పక్కింట్లోనే ఆశ్లే అండ్ ఫ్యామిలీ దిగుతుంది.

తర్వాత వీరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. వయసులో పెద్ద వాడైనప్పటికీ అభిరుచులు కలవడంతో జస్టిన్ ను ప్రేమిస్తుంది ఆశ్లే. మరి ఆమె ప్రేమను జస్టిన్ యాక్సెప్ట్ చేశాడా? వీరి కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? సాయూజ్య, జోయల్ ప్రేమ కథకి హరి (శ్యామ్ మోహన్) వల్ల ఎదురైన ఇబ్బందులు ఏంటి? చివరికి వారి ప్రేమ కథ ఏమైంది? అసలు ఆశ్లే వచ్చేవరకు జస్టిన్ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు? అనేది మిగిలిన కథ.

Bethlehem Kudumba Unit Movie Review And Rating

నటీనటుల పనితీరు: నివిన్ పౌలి (Nivin Pauly) ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసేస్తుంటాడు. ఈ సినిమాలో కూడా అతని మేకోవర్ బాగుంది. ‘ప్రేమమ్’ రోజులను గుర్తుచేస్తుంది. అలాగే చాలా మెచ్యూర్డ్ గా పెర్ఫార్మ్ చేశాడు. మామితా బైజు కూడా బాగా సెట్ అయ్యింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లో చేసిన పాత్రకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. కానీ ఆ సినిమాలో అల్లరి పిల్లగా చేసింది. ఈ సినిమాలో మాత్రం అమాయకురాలిగా జీవించింది.

సంగీత్ ప్రతాప్ కొన్ని సన్నివేశాల్లో తన మార్క్ కామిడీతో అలరించాడు. ‘ప్రేమలు’ ఫేమ్ శ్యామ్ మోహన్ ఈ సినిమాలో హరి పాత్రలో సీరియస్ గా కనిపిస్తూనే కామిడీ పండించాడు. గ్లిక్సన్ పాత్ర చేసిన రోషన్ సైతం తన మార్క్ కామిడీతో అలరించాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.

Bethlehem Kudumba Unit Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ (Bethlehem Kudumba Unit) కథ పరంగా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అనిపించదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా లైన్ కి చాలా సిమిలర్ గా ఉంటుంది. కానీ అక్కడి నేపధ్యం వేరు. ఇక్కడి నేపధ్యం వేరు. దర్శకుడు గిరీష్ ఎ డి రూరల్ కామెడీతో చాలా ఎంగేజింగ్ గా కథనాన్ని నడిపించాడు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ వద్ద కావచ్చు, అతని తమ్ముడి ఫ్రెండ్స్ గ్యాంగ్ వద్ద కావచ్చు..వచ్చే కామిడీని అన్ని వర్గాల ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే సెకండాఫ్ కొంత లెంగ్తీగా అనిపిస్తుంది.

క్లైమాక్స్ లో వచ్చే స్కూల్ ఫైట్ ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. హీరోయిన్ ఫ్యామిలీ ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు, చివరికి ఎందుకు లైట్ తీసుకున్నారు? అనే దానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. కాకపోతే మలయాళం సినిమాలకి ఉండే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. టెక్నికల్ వర్క్ చాలా క్వాలిటీగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, సౌండింగ్, ఎడిటింగ్ అన్నీ ఆడియన్స్ ని కట్టి పారేస్తుంటాయి. లొకేషన్స్ సాదా సీదాగా ఉన్నప్పటికీ ఆ లోటు ఎక్కడా కనిపించదు. ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ కూడా టెక్నికల్ గా ఫుల్ మార్క్స్ వేయించుకుంటుంది.

Bethlehem Kudumba Unit Movie Review And Rating

విశ్లేషణ: సెకండాఫ్ లో కొన్ని కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అలాగే ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ని తెలుగులో డబ్ చేసిన విధానం బాగుంది. డైలాగ్స్ బాగా కుదిరాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి. నిస్సందేహంగా ఈ వీకెండ్ కి థియేటర్ కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా.

Bethlehem Kudumba Unit Movie Review And Rating

ఫోకస్ పాయింట్: బ్యూటిఫుల్ అండ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bethlehem Kudumba Unit Movie
  • #Mamitha Baiju
  • #Nivin Pauly
  • #Sangeeth Prathap)

Reviews

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

49 mins ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

22 hours ago

latest news

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

8 mins ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

2 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

3 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

16 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version