ఇంట్రనేషనల్ ప్రాజక్ట్ అందుకున్న అశోక్.!

స్వీటీ అనుష్కను భాగమతిగా అశోక్ అద్భుతంగా చూపించారు. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ థ్రిల్లర్ భారీ కలక్షన్స్ రాబట్టింది. డైరక్టర్ కి అనేక అవకాశాలు తలుపుతట్టాయి. టాలీవుడ్ నిర్మాతలు క్యూ లో ఉంటే అశోక్ మాత్రం సాహసోపేతమైన ప్రాజక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వాతంత్య్రానికి పూర్వం 1914 లో జరిగిన ఓ నిజమైన సంఘటనను ఆధారంగా చేసుకొని సినిమాని తెరకెక్కించనున్నారు. కోమగట మరు అనే జపనీస్ స్టీమ్ షిప్ ని బ్రిటిష్ రాజు ఆధ్వర్యంలో ఉన్నింది. ఇందులో భారతీయులు బానిసలుగా ఉండేవారు.

ఈ షిప్ ద్వారా కెనెడా లోకి వెళ్లాలని బ్రిటిష్ రాజు ప్లాన్ వేశారు. అయితే కెనడా వాసులు ఈ షిప్ ని తిప్పికొట్టారు. ఇదంతా  1914 లో జరిగింది. అందుకే ఈ సినిమాకి “కోమగట మరు 1914″ అనే పేరు ఖరారు చేశారు. దీని గురించి డైరక్టర్ అశోక్ మాట్లాడుతూ ” ఈ కథ విన్నప్పుడు నేను చాలా ఎమోషనల్ ఫీలయ్యాను. అందుకే ఈ కథని డైరక్ట్ చేయాలనీ ఫిక్స్ అయ్యాను” అని అన్నారు. మెహమూద్ అలీ ఈ కథని స్క్రిప్ట్ రూపంలో మలుస్తున్నారు. కెనడియన్ ఫిలిం కౌన్సిల్ వాళ్ళు నిర్మిస్తున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus