తెలుగు & తమిళ్ భాషల్లో ఈనెల 12న విడుదల అవుతున్న ‘భగత్ సింగ్ నగర్’ ఫస్ట్ లుక్

లండన్ పార్లమెంట్ హౌస్ లో మన తెలుగు ఖ్యాతిని చాటుతు మొట్ట మొదటి ఉగాది సంబరాలను నిర్వహించిన మన విజయనగర వాసి రమేష్ ఉడత్తు, హైదరాబాద్ నివాసి శ్రీమతి గౌరి వాలాజా గారు సంయుక్తంగా గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ స్థాపించి చలన చిత్ర రంగం లోకి అడుగుపెట్టారు. ఈ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1.గా విదార్థ్ మరియు ధృవికలను పరిచయం చేస్తూ తెలుగు మరియు తమిళ బాషలో ఏక కాలంలో చిత్రీకరించడం జరిగింది, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జులై 12వ తేదిన ఓ ప్రముఖ వ్యక్తి చేతులపై విడుదల చేస్తున్న సందర్భంగా…

భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ… నిన్న విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ కు లభించిన స్పందనకు మీడియా మిత్రులకు మరియు సోషల్ మీడియా స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ చిత్రం భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక అందమైన ప్రేమకథ. భగత్ సింగ్ గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు..

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus