Bhagyashree, Salman Khan: సూపర్‌ హిట్‌ హగ్‌ గురించి భాగ్యశ్రీ!

సల్మాన్ ఖాన్‌ – భాగ్యశ్రీ… ఈ జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘మైనే ప్యార్‌ కియా’లో ఈ జోడీని చూసి… యువత మురిసిపోయారు. ఆ జోడీ గురించి ఎంత చెప్పినా, ఏం చెప్పినా ఆసక్తికరంగానే ఉంటుంది. అందులోనూ ‘మైనే ప్యార్‌ కియా’ టైమ్‌లో ఏం జరిగిందో చెబితే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. అందులోనూ ఆ సినిమాలోని రొమాంటిక్‌ సీన్స్‌ గురించి అయితే చెవులు రిక్కించి వింటారు. రాస్తే కళ్లు పెద్దవి చేసి చదువుతారు.

‘మైనే ప్యార్‌ కియా’ చిత్రీకరణ సమయంలో తొలుత కొంత ఇబ్బందిపడిందట భాగ్యశ్రీ. ఆ తర్వాత సెట్‌లో ఉన్న వాళ్లందరూ పరిచయమై… ఇబ్బంది తగ్గిందని భాగ్యశ్రీ చెప్పింది. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు భాగ్యశ్రీకి 18 ఏళ్లట. అప్పటికే ఆమె ఓ వ్యక్తితో ప్రేమలో ఉందట. అంతేకాదు త్వరలో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందట. దాంతో ఆ సినిమాలో రొమాంటిక్‌ సన్నివేశాల సమయంలో ఇబ్బందులు పడిందట. సినిమాలోని ఓ సీన్‌ కోసం సల్మాన్‌ని కౌగిలించుకోవాల్సి వచ్చిందట.

త్వరలో పెళ్లి అనుకొని వేరే వ్యక్తిని ఎలా కౌగలించుకోవడం అని సందేహపడిందట. ఆ సీన్‌ చేయనని చెప్పేయాలని అనుకుందట. అయితే అదే సమయంలో సల్మాన్‌ ఖాన్‌ ఆమె దగ్గరకు వచ్చి.. ‘సినిమా కోసం ఈ సీన్‌ చేయండి’ అని అడిగారట. ఆయన మాటకు గౌరవమిచ్చి ఓకే అన్నారట భాగ్యశ్రీ. సల్మాన్‌ – భాగ్యశ్రీ మధ్య ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించాలని టీమ్‌ రెడీ అయ్యిందట. అయితే భాగ్యశ్రీ చాలా ఇబ్బంది పడ్డారట. ఆమె ఇబ్బందిని గుర్తించిన దర్శకుడు… సల్మాన్‌కి, భాగ్యశ్రీకి మధ్య ఓ గ్లాస్‌ పెట్టారట. ఆ తర్వాత సల్మాన్, భాగ్యశ్రీ ఆ అద్దానికి ముద్దు పెట్టారట. అలా ఆ కిస్‌ సీన్‌ షూట్‌ చేశారని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus