Bhagyasree, Prabhas: ప్రభాస్ మూవీపై భాగ్యశ్రీ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో నటించిన రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. మైనే ప్యార్ కియా సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన భాగ్యశ్రీ నటిగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. భాగ్యశ్రీ రాధేశ్యామ్ సినిమాలో నటించిన పాత్ర గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాధేశ్యామ్ సినిమాలో తాను ప్రభాస్ తల్లి పాత్రలో నటించడం లేదని సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నానని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు.

తన పాత్ర లేకపోతే రాధేశ్యామ్ సినిమానే లేదని భాగ్యశ్రీ వెల్లడించారు. సినిమాకు తన పాత్రను తీసేస్తే ప్రాబ్లమ్ అని తన పాత్ర లేకపోతే రాధేశ్యామ్ సినిమా లేదని భాగ్యశ్రీ వెల్లడించారు. సినిమాలో తన రోల్ ఫుల్ లెంగ్త్ రోల్ అని బాగ్యశ్రీ వెల్లడించడం గమనార్హం. ఇకపై తాను ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తానని భాగ్యశ్రీ తెలిపారు. విదేశాల్లోనే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం జరిగిందని భాగ్యశ్రీ అన్నారు.

సినిమాలో కొన్ని సన్నివేశాలను సెట్స్ లో షూట్ చేశారని ఆ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని భాగ్యశ్రీ వెల్లడించారు. రాధేశ్యామ్ సినిమాను థియేటర్లలో చూస్తే బాగుంటుందని భాగ్యశ్రీ అన్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus