టాలీవుడ్ లో ఎన్నో లవ్ స్టోరీస్….సుఖాంతం అయ్యాయి…మరెన్నో లవ్ స్టోరీస్ మధ్యలోనే ఎండ్ అయిపోయాయి. అయితే అప్పట్లో ఒక టాప్ హీరోయిన్….ఆ టాప్ హీరోయిన్ కి ప్రపోస్ చేసిన మరో అప్పటి టాప్ దర్శకుడు. కొన్నేళ్ల ప్రేమ సడన్ గా మాయం అయిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు…ఇంతకీ ఎవరా హీరోయిన్?? ప్రపోస్ చేసిన దర్శకుడు? ఏంటి ఆ కధ అంటే…ఈ కధ చదవాల్సిందే….విషయం ఏమిటంటే….టాలీవుడ్ లో డిఫరెంట్ మ్యానరిజం తో సినిమాలు తీసే దర్శకుల్లో అప్పటి వంశీ ఒకరు. అప్పట్లో…ఆయన తీసిన సినిమాల్లో సితార.. అన్వేషణ.. ఆలాపన లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి.ఇదిలా ఉంటే అప్పట్లో తన నటనతో ఇండస్ట్రీ ని షేక్ చేసిన హీరోయిన్ భాను ప్రియ..అంతేకాదు….అయితే ఇప్పుడు ప్రస్తుతం తల్లి పాత్రలు కేరక్టర్ రోల్స్ లో నటిస్తుంది భాను.
ఇదిలా ఉంటే భాను కరియర్ లో ఎన్ని అమోఘమైన రోల్స్ ఉన్నా…ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా…దర్శకుడు వంశీ భానుప్రియను చూపిన తీరు అమోఘం అనాల్సిందే. సితార.. అన్వేషణ.. ఆలాపన వంటి సినిమాల్లో భానుప్రియ పాత్ర అద్భుతంగా ఉండడమే కాదు.. ఆయా సినిమాల్లో ఉన్న హీరోలను డామినేట్ చేసేసేది. అయితే అంతగా భాను పాత్రను మలచడంలో మతలబు ఏంటి అంటే….అప్పటికీ వంశీ భానుపై పీకల్లోతుల్లో ప్రేమలో మునిగిపోవడమే. అంతేకాదు…ఆమెకు ప్రపోస్ కూడా చేసాడని…ఆమె కోసం తన కెరీర్ ని నిర్లక్షం చేశాడని కూడా అప్పట్లో చెప్పుకునేవారు. మరి ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ….మొత్తానికి వీరి ప్రేమ మాత్రం పెళ్లి పీటలు ఎక్కకుండానే సైడ్ అయిపోయింది..ఇక ఇదే విషయాన్ని మన భాను ప్రియ తాజాగా ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యులో తెలుపడం విశేషం.