“భరత్ అనే నేను” ఆడియో వేడుకకు భారీ ఏర్పాట్లు..!

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న “భరత్ అనే నేను” (Bharat Ane Nenu) సినిమాకి ప్రచారాన్ని మొదటి నుంచి విభిన్నంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి మొదట ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకుండా ఫస్ట్ ఓత్ పేరుతో ముఖ్యమంత్రిగా మహేష్ ప్రమాణం చేస్తున్న వాయిస్ ని వినిపించారు. ఆ తర్వాత లుక్ రిలీజ్ చేశారు.  ఈ మూవీ టీజర్ ని కూడా “ది విజన్ ఆఫ్ భరత్’ పేరుతో రిలీజ్ చేసి రికార్డు నెలకొల్పారు. ఈ వీడియో 19గంటల్లోనే కోటి డిజిటల్ వ్యూస్‌ని రాబట్టి ఔరా అనిపించింది. ఉగాదికి పంచెకట్టుతో ఉన్న ముఖ్యమంత్రి లుక్ ని విడుదల చేసి అదరగొట్టారు. ఇదే విధంగా వినూత్న రీతిలో ఆడియో వేడుకను నిర్వహించడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ వేడుక కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని పోలిన సెట్ వేస్తారట. ఈ వేడుకపై మహేష్ ముఖ్యమంత్రి లుక్ లో అభిమానులను ఆనందింపజేయిస్తారని టాక్. ప్రస్తుతం పండుగ నేపథ్యంలో పాటని షూట్ చేస్తున్నారు. దీని తర్వాత మిగిలిన పాట కోసం విదేశాలకు వెళ్లనున్నారు. అక్కడి షెడ్యూల్ పూర్తి కాగానే ఆడియో వేడుకను తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 20న విడుదల కానుంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus