తెలుగు చిత్రపరిశ్రమకు ఈ ఏడాది రంగస్థలం రూపంలో తొలి సూపర్ హిట్ దక్కింది. నాన్ బాహుబలి రికార్డులన్నిటినీ ఈ మూవీ తిరగరాసింది. సుకుమార్, రామ్ చరణ్ తేజ్ కలయికలో వచ్చిన ఈ చిత్రం మార్చి 30 న రిలీజ్ అయింది. కలక్షన్ల వర్షం కురిపించింది. నెల రోజులకి 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి మెగా హీరో సత్తాని చాటింది. అలాగే ఓవర్సీస్ లోను 3 .5 డాలర్ల క్లబ్ లో చేరి రామ్ చరణ్ కెరీర్ లో మరుపురాని చిత్రంగా నిలిచింది. అయితే ఈ రికార్డులు కొన్ని రోజులు కూడా నిలవడం లేదు. రంగస్థలం కంటే 20 రోజులు వెనక వచ్చిన భరత్ అనే నేను సునామీ మాదిరిగా రంగస్థలం రికార్డులను తుడిపేస్తోంది. ఏప్రిల్ 20 న రిలీజ్ అయిన మహేష్ సినిమా వేగంగా 150 కోట్లను గ్రాస్ చేసింది.
ఓవర్సీస్ లో అయితే దూసుకుపోతోంది. అక్కడి రిపోర్ట్స్ ప్రకారం.. సినిమా రిలీజైన 12వ రోజుకు 3 మిలియన్ ట్రేడ్ మార్క్‌ను అమెరికాలో దాటేసింది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది. ”భరత్ అనే నేను లేటెస్ట్ ఓవర్సీస్ బాక్సాఫీస్ ఏప్రిల్ 30 వరకు యూఎస్ఏలో 3, 192,011 డాలర్లు(రూ.21.32 కోట్లు), ఆస్ట్రేలియాలో ఏప్రిల్ 29 వరకూ 443,974 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 2.23 కోట్లు) వసూలు చేసింది” అని రమేష్ బాలా ట్వీట్ చేశారు. అమెరికాలో అతి త్వరలోనే 3 .5 డాలర్లను క్రాస్ చేసి రంగస్థలాన్ని వెనక్కి నెట్టనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే 20 రోజులకంటే ముందే 200 కోట్ల మార్క్ ని దాటేస్తుందని భావిస్తున్నారు.