టాప్ 3 స్థానకోసం పోటీ పడుతున్న భరత్ అనే నేను .!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదరగొట్టింది. అలాగే ఓవర్సీస్ లో3మిలియన్ డాలర్లు సాధించింది.  శనివారం నాటికి ఈ మార్క్ ని క్రాస్ చేసింది. అంతేకాదు, బాహుబలి-1 తర్వాత అతి తక్కువ రోజుల్లో 3మిలియన్ డాలర్లు వసూలు చేసిన  సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇప్పటి వరకు మూడు మిలియన్ డాలర్ల మార్క్ ని దాటినా సినిమా జాబితాల్లో బాహుబలి-2, బాహుబలి-1, రంగస్థలం సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు భరత్ అనే నేను చేరింది. ఇంకో హాఫ్-మిలియన్ డాలర్ల వసూళ్లు వసూలు చేస్తే రంగస్థలాన్ని పక్కకు నెట్టి మూడో స్థానాన్ని కైవశం చేసుకుంటుంది. భరత్ అనే నేను జోరు చూస్తుంటే.. మరో నాలుగు రోజుల్లో ఈ ఫీట్ సాధించేలా ఉందని యుఎస్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ జూన్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus