భరత్ అనే నేను సాంగ్స్ ఎలా ఉన్నాయంటే ?

  • April 11, 2018 / 05:16 AM IST

కొరటాల శివ తన తొలి చిత్రం నుంచి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ను తనవెంట తీసుకొస్తున్నారు. వేరే సంగీతదర్శకుడు వైపే వెళ్ళలేదు. తాను ఆశించిన దానికంటే సంతృప్తిగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడమే అందుకు కారణం. తాజాగా భరత్ అనే నేను సినిమాకి కూడా పొలిటికల్ ఫీల్ ఉండేలా.. సంగీత ప్రియులు మెచ్చుకునేలా పాటలు అందించారు. ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం.

భరత్ అనే నేను

“పాలించే ప్రభువుని కానని.. సేవించే బంటుని నేనని”.. అని ఒక్క వాఖ్యంలో ఈ సినిమాలోని ముఖ్యమంత్రి క్యారక్టర్ ని ఈ సాంగ్ ద్వారా రామజోగయ్య శాస్త్రి చెప్పారు. భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను.. అంటూ ఒక పాట రూపంలో చెప్పడం అందంగా ఉంది. అందరూ పాడుకునేలా దేవీ ట్యూన్ ఇచ్చారు. డేవిడ్ ఫీల్ తో పాడి హిట్ చేశారు.

ఐ డోంట్ నో


బాలీవుడ్ సింగర్, డైరక్టర్, యాక్టర్ ఫర్హాన్ అక్తర్ తొలిసారి పాడిన పాట “ఐ డోంట్ నో”. తెలుగుని స్పష్టంగా పలికి మొదటిపాటతోనే తెలుగువారి మెప్పు అందుకున్నారు. ఒకసారి వింటే ఈ పాటని ఆస్వాదించడం కష్టమే.. వినగా వినగా.. లిరిక్స్ అర్ధమై.. ఇష్టమైన సాంగ్స్ జాబితాలో చేరిపోతుంది.

వచ్చాడయ్యో సామి


భరత్ అనే నేను ఆల్బం లో మొదటి స్థానంలో నిలిచిన పాట ఇది. రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన అద్భుతమైన సాహిత్యానికి కైలాష్ ఖేర్ గాత్రం పాటని గుండె లోతుల్లోకి తీసుకెళ్లింది. దివ్య కుమార్ కూడా పాటకి మరింత బలమయ్యారు. “కష్టం చుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి…”, “అసలైన పండుగ ఎప్పుడంటే.. ఆ కన్నతల్లి కంటనీరు తుడిచినా రోజేగా..”.. అంటూ శాస్త్రి కలంతో కబడ్డీ ఆడేశారు. సీమ గురించి చెప్పిన విధానం బాగుంది. తెరపైన కూడా నంబర్ పాటగా నిలపడంతో కొరటాల తప్పకుండా విజయం సాధిస్తారు.

ఇదే కలల ఉన్నదేఆల్బమ్ లో సింపుల్ గా సాగిపోయే పాట “ఇదే కలల ఉన్నదే”. గాయని, నటి ఆండ్రియా స్వరం ఈ పాటకి ప్లస్ అయింది. ఈ పాటను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఓ వసుమతి


ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక డ్యూయెట్ “ఓ వసుమతి”. “ప్రపంచం యేలు నాయికా ఇదేగా నీకు తీరిక” అనే పద ప్రయోగాలు ముఖ్యమంత్రి బిజీ లైఫ్ ని ప్రతిబింబిస్తుంది. మహేష్, కైరా అద్వానీల కెమిస్ట్రీ ఈ పాటలో కనివిందు చేయనుంది.

పొలిటికల్ సీరియస్ నెస్ మిస్ కూడదని కొరటాల ఐటెం సాంగ్ ని మిస్ చేశారు. అయినప్పటికీ ఈ ఆల్బం ఎవరినీ నిరుత్సాహపరచదు. ఐదు పాటల్లో మూడు హిట్ సాంగ్స్ ఆల్బంని సూపర్ హిట్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 20 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సాంగ్స్ ని వెండితెరపై చూసిన తర్వాత మరింతమంది మెచ్చుకుంటారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus