‘భరత్ అనే నేను’ సినిమా స్టోరీ ఇలానే ఉంటుందట!

  • July 24, 2017 / 03:19 PM IST

మహేష్ బాబు – కొరటాల శివ కాబినేషన్లో ‘శ్రీమంతుడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. కొరటాల శివ ఎక్కువగా సామాజిక అంశాల మీద దృష్టి పెట్టే దర్శకుడు కావడం, టైటిల్ చూస్తే దేశ భక్తి ఉట్టిపడుతుండటంతో ఈ సినిమా పక్కా సోషల్ సబ్జెక్ట్ అని అందరిలోనూ ఒక అభిప్రాయానికి వచ్చారు, గత కొద్ది రోజులుగా ఈ సినిమా పూర్తిస్థాయి పొలిటికల్ డ్రామాగా ఉంటుందని, మహేష్ ముఖ్యమంత్రిగా కనబడతారనే వార్తలు కూడా వచ్చాయి. హైదరాబాద్ సిటీ శివార్లలో వేసిన అసెంబ్లీ సెట్ లో మహేష్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షూటింగ్ లో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కూడా పాల్గొంది.

దీని గురించి మీడియాతో మాట్లాడిన కొరటాల శివ ఈ సినిమా ఏ పొలిటికల్ పార్టీని, లీడర్ ను ఉద్దేశించి రూపొందిస్తున్నది కాదని, ఇందులో సెటైరికల్ డైలాగ్స్ ఉండవని అంటూనే రాజకీయాల కన్నా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పారు.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు. 2018 సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 11 న “భరత్ అను నేను” థియేటర్లోకి తీసుకురానున్నారు. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus