స్పెయిన్ లో పాట చిత్రీకరణలో భరత్ అనే నేను టీమ్.!

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న “భరత్ అనే నేను” సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను ఫస్ట్ ఓత్, “ది విజన్ ఆఫ్ భరత్(టీజర్)”  మరింత పెంచాయి. మహేష్ అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉండేలా కొరటాల తెరకెక్కిస్తున్నారు.  ప్రస్తుతం చిత్ర యూనిట్ స్పెయిన్ లో ఉంది. అక్కడ మహేష్, కైరా అద్వానీలపై ఒక రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించే పనిలో బిజీగా ఉంది. ఈ సాంగ్ షూటింగ్ ఏప్రిల్ 5 న కంప్లీట్ కానుంది. దీని తర్వాత కొరటాల, మహేష్ టీమ్ సభ్యులు  హైదరాబాద్ కి తిరిగిరానున్నారు.

ఏప్రిల్ 7న  హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఆడియో వేడుకలో పాల్గొననున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు సినిమాకి బలం కానున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమాకి దేవీ మంచి ఆల్బమ్ ఇచ్చారు. మళ్ళీ అదే కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమాకి అంతకంటే మంచి ఆల్బం ఇచ్చి ఉంటారని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 20న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus