Darshan Case: కేసు నుంచి తప్పించుకోవాలని దర్శన్ ఇలా చేస్తున్నారా.. ఏం జరిగిందంటే?

కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్ ఏ2గా ఉన్నారు. అయితే దర్శన్ మానసిక స్థితి గురించి పలు విషయాలు వైరల్ అవుతుండగా ఆ వార్తలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. కొంతమంది వైద్యులు దర్శన్ కు మానసిక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో కూడా దర్శన్ గొడవ పడిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తోంది.

దర్శన్ ఇతరులను కొట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని సమాచారం అందుతోంది. చాలా సందర్భాల్లో దర్శన్ పట్టలేని ఆగ్రహంతో ఊగిపోయేవారని తెలుస్తోంది. అయితే స్టార్ హీరో కావడంతో దర్శన్ విషయంలో చాలామంది చూసీ చూడనట్లు వ్యవహరించారని సమాచారం అందుతోంది. దర్శన్ కు కౌన్సిలింగ్ కొనసాగించి ఉంటే బాగుండేదని అతనితో పరిచయం ఉన్న కొంతమంది వైద్యులు వెల్లడిస్తున్నారు.

దర్శన్ కు వెంటనే కౌన్సిలింగ్ లేదా వైద్యం అందిస్తే మంచిదని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. దర్శన్ జైలు పాలు కావడం ఇదే తొలిసారి కాదు. 13 ఏళ్ల క్రితం భార్యపై దాడి కేసులో దర్శన్ అరెస్ట్ కావడం జరిగింది. దర్శన్‌ ఆరోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగాలేదనే ప్రచారం బెయిల్ కోసమే అని మరికొందరు చెబుతున్నారు.

ప్రభుత్వ వైద్యులు పరీక్షలు చేస్తే మాత్రమే దర్శన్ మానసిక స్థితికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దర్శన్ కు సంబంధించి చాలా విషయాలు తెలుస్తున్న నేపథ్యంలో వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దర్శన్ అరెస్ట్ తో ఆయన అభిమానులు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus