పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించారు. ఫిబ్రవరి 25న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తున్నప్పటికీ ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్ట్ చేసింది.అయితే రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది.ఇక 11వ రోజున అయితే మరింత దారుణం అని చెప్పాలి. ఒకసారి 11 రోజుల కలెక్షన్లు గమనిస్తే :
నైజాం | 30.88 cr |
సీడెడ్ | 10.72 cr |
ఉత్తరాంధ్ర | 7.24 cr |
ఈస్ట్ | 5.36 cr |
వెస్ట్ | 4.98 cr |
గుంటూరు | 5.05 cr |
కృష్ణా | 3.70 cr |
నెల్లూరు | 2.41 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 70.34 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 7.28 cr |
ఓవర్సీస్ | 12.31 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 89.93 cr |
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.89.93 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.20.07 కోట్ల షేర్ ను రాబట్టాలి. 11 వ రోజున ఈ చిత్రం రూ.0.40 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కష్టమనే చెప్పాలి..!
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!