పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తున్నప్పటికీ ఈ చిత్రం భారీగా కలెక్ట్ చేసింది.6 వ రోజున కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఒకసారి 6 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 29.53 cr |
సీడెడ్ | 9.51 cr |
ఉత్తరాంధ్ర | 6.58 cr |
ఈస్ట్ | 4.95 cr |
వెస్ట్ | 4.56 cr |
గుంటూరు | 4.75 cr |
కృష్ణా | 3.22 cr |
నెల్లూరు | 2.26 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 65.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.90 cr |
ఓవర్సీస్ | 11.45 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 83.71 cr |
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.83.71 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.26.29 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 వ రోజున మంగళవారం నాడు కూడా ఈ చిత్రం రూ.4.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఇంకా మరో వీకెండ్ బ్యాలన్స్ ఉంది కాబట్టి.. ‘భీమ్లా’ కి ప్లస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఆ ఛాన్స్ ను ఎంత వరకు వాడుకుంటుందో చూడాలి..!
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!