Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదేనా?

పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల శివరాత్రికి వాయిదా పడగా సినిమా రిలీజ్ డేట్ లో మార్పు లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటివారంలో భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ కానుందని బోగట్టా.

భీమ్లా నాయక్ మేకర్స్ అతి త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు. ఓవర్సీస్ లో భారీస్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుందని బోగట్టా. భీమ్లా నాయక్ కు ముందు వెనక పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. భీమ్లా నాయక్ కు సోలో రిలీజ్ డేట్ లభించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.

భీమ్లా నాయక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో రానా నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత సరైన సక్సెస్ కోసం రానా ఎదురుచూస్తున్నారు. మరి రానా ఎదురుచూస్తున్న సక్సెస్ భీమ్లా నాయక్ తో దక్కుతుందో లేదో చూడాలి.

ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను చూసిన ప్రేక్షకులకు సైతం బోర్ కొట్టకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం. ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో నిడివిని తగ్గించడం ద్వారా రోజుకు నాలుగు షోలు ప్రదర్శించేలా చేయవచ్చని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. భీమ్లా నాయక్ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ ధరలు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus