‘భీష్మ’ ఫస్ట్ గ్లిమ్ప్స్ అదిరింది..!

నితిన్,రష్మిక.. హీరో హీరోయిన్లుగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘భీష్మ’. ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉప శీర్షిక(క్యాప్షన్). ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుములు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక దర్శకుడు వెంకీ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు పెద్ద శిష్యుడు అన్న సంగతి తెలిసిందే. ఈరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రానికి సంబంధించి ‘ఫస్ట్ గ్లిమ్ప్స్’ ను విడుదల చేసాడు.

ఇక ఈ వీడియో చాలా రొమాంటిక్ గా.. యూత్ ను ఆకట్టుకునే విధంగా కట్ చేశారు. ఓ ఆఫీస్ లో హీరోయిన్ రష్మిక చీర కట్టుకుని ఉండగా ఆమెను ఫాలో అవుతూ హీరో నితిన్ ఆ ఆఫీస్ క్యాంటిన్ వరకూ వచ్చేస్తాడు. తరువాత రష్మిక వెనక్కి తిరిగి చూడగా చింపేసారు అంటూ నితిన్ సైగ చేస్తుంటాడు. ఈ టీజర్ బట్టి ఆ ఆఫీస్ లో రష్మిక ఓ ‘టీం లీడ్’ అని తెలుస్తుంది. ‘నా లవ్ విజయ్ మాల్యా లాంటిది రా.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయడం కష్టం’ అంటూ ఆ ఆ క్రమంలో వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటుంది. త్రివిక్రమ్ శిష్యుడు కాబట్టి అదే రేంజ్ లో వెంకీ ఈ డైలాగ్ రాసాడు అనిపిస్తుంది. నితిన్ అయితే నిజంగా చింపేసాడనే చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus