Bhole Shavali: భోలే శవాలి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కిపోతారు..!

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కి రెండింతలు ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయి. అంతే కాకుండా స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నెంబర్ 1 స్థానం లో నిలిపింది. ఇదంతా పక్కన పెడితే గత వారం కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

వారిలో భోలే శవాలి చాలా డిఫరెంట్ గా అనిపించాడు. హడావడి గా మాట్లాడడం, పనులు చెయ్యడం, ఇతరుల విషయాల్లో కలగచేసుకోవడం, ఇలాంటివి ఎన్నో చేస్తున్నాడు. కొంత మంది నెటిజెన్స్ ఇతనిని అతి పర్సన్ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చెయ్యడం మనం గమనించొచ్చు. అయితే ఎవరు ఈ భోలే శవాలి?, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు ఏంటి?, అసలు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము..

భోలే శివాలి (Bhole Shavali) తెలంగాణ ప్రాంతం లోని మహబూబాబాద్ జిల్లాకి సంబంధించిన పెను గొండ అనే గ్రామానికి చెందిన వ్యక్తి. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఈయన, సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు యూట్యూబ్ లో పలు ప్రైవేట్ వీడియోస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అలా పాపులర్ అయినా భోలే శివాలి, బాహుబలి సినిమాలోని ‘పచ్చబొట్టేసిన’ పాట కి కీరవాణి సారథ్యం లో మ్యూజిక్ వాయించాడు. ఆ తర్వాత అనేక సినిమాలకు పాటలు పాడుతూ,

మ్యూజిక్ కంపోజ్ చేస్తూ వచ్చిన భోలే శివాలి రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ‘మ్యాడ్’ చిత్రం లోని పాటలు మొత్తానికి లిరిక్స్ అందించాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. భోలే శివాలి ఎక్కువగా గాయకుడిగానే ప్రసిద్ధి చెందాడు. అలా ఆయన నమ్ముకున్న ఈ రంగం నుండి ఎంతో కష్టం చేసి 15 కోట్ల రూపాయిల వరకు సంపాదించాడు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా ఆయన మరింత పాపులారిటీ ని సంపాదించి ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కించుంటాడో లేదో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus