Bigg Boss 7 Telugu: 8వ వారం మంటలు లేపిన నామినేషన్స్..! మెంటల్ ఎక్కించిన భోలే పంచ్ లు..!

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ మంటలు పుట్టించాయి. మంటల్లో ఫోటోలు వేసి నామినేట్ చేయమంటే హౌస్ మేట్స్ గుండెల్లో మంటలు పుట్టించారు. ముఖ్యంగా భోలే గతవారం మాట్లాడిన బూతులు ఈవారం టార్గెట్ అయ్యాయి. నాగార్జున ఎప్పుడైతే తప్పుని చెప్పారో హౌస్ మేట్స్ కి నామినేషన్స్ కి పాయింట్స్ దొరికేశాయ్. గతవారం భోలేకి 7 ఓట్లు వస్తే, ఈవారం నామినేషన్స్ లో భోలే కి 5 ఓట్లు వచ్చాయి. అంతేకాదు, శోభాశెట్టికి – భోలేకి మాటల యుద్ధమే జరిగింది.

నిజానికి నామినేషన్స్ మొదలు పెట్టాగనే భోలే టాపిక్ లో స్టాండ్ తీస్కుని బోలోకి సపోర్ట్ చేస్తూ శివాజీ నామినేషన్స్ ని స్టార్ట్ చేశాడు. దీంతో హౌస్ మేట్స్ అయిన శోభా, ప్రియాంక ఇద్దరూ అది కరెక్ట్ కాదని వాదించడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, శివాజీ నామినేషన్స్ ని తప్పుబట్టారు. చిన్న పాయింట్ లో తప్పైపోయింది క్షమించు అని అడిగినా సరే , క్షమించకపోవడాన్ని శివాజీ తప్పుబడ్డాడు. శోభా అలియాస్ మోనిత మొండిపట్టు పట్టింది. దీంతో ఇద్దరి మద్యలో బాగా వాదన చోటు చేసుకుంది.

ఆ తర్వాత ప్రియాంక , గౌతమ్, సందీప్, అర్జున్ , తేజ ఇలా భోలేని నామినేషన్స్ లోకి తీస్కుని వచ్చారు. కొంతమంది భోలే బుతులు తప్పుబడితే, మరికొంతమంది కెప్టెన్సీ టాస్క్ లో కంటెండర్ షిప్ ని శివాజీకి ఈజీగా ఇచ్చేసి గేమ్ లో వెనకబడ్డావ్ అంటూ మాట్లాడారు. సందీప్ అయితే బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నాడు. నిజానికి గౌతమ్, అమర్ గతంలో చాలా బూతులే మాట్లాడారు. కానీ, ఎప్పుడూ కూడా ఈవిషయంలో సందీప్ వాళ్లని నామినేట్ చేయలేదు. మరోవైపు శోభాశెట్టి కూడా భోలేకి క్లాస్ పీకే ప్రయత్నం చేసింది.

ఫ్యూచర్ లో ఈ నామినేషన్స్ నీకు గుర్తుండిపోవాలి అని భోలే అంటే, నేను బయటకి వెళ్లిన తర్వాత నీ ఫేస్ కూడా నాకు గుర్తుండదు. దానికి కూడా నేను ఇష్టపడను అన్నట్లుగా మాట్లాడింది శోభాశెట్టి. ఇద్దరి మద్యలో గట్టి వాదనే జరిగింది. తర్వాత భోలే గౌతమ్ పై పాట పాడుతూ, పంచ్ లు పేలుస్తూ రెచ్చిపోయాడు. అలాగే, ప్రియాంక నామినేట్ చేసేటపుడు కూడా పాయింట్ వదిలేసి వేరే విషయాలు మాట్లాడుతూ కాసేపు ఫన్ చేసి పంచ్ లు వేశాడు. ఇదంతా చూసిన హౌస్ మేట్స్ ఆడియన్స్ కూడా భోలే పంచ్ లు అర్దం కాక అయోమయంలోకి వెళ్లారు.

ఇక 8వ వారం (Bigg Boss 7 Telugu) నామినేషన్స్ వేడెక్కిపోయాయి. హౌస్ మేట్స్ ఫోటోలని కాలుస్తూ చేసిన ఈ ఫైర్ నామినేషన్స్ లో హౌస్ లో సెగలు పుట్టించాయి. పల్లవి ప్రశాంత్ ఇంకా అమర్ , అలాగే గౌతమ్ ఇంకా ప్రశాంత్, యావర్ – ప్రియాంక, శివాజీ- ప్రియాంక ఇలా అందరూ పెద్ద మాటల యుద్ధమే చేసుకున్నారు. ఈవారం మొత్తం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇందులో ప్రియాంక ఫిమేల్ కంటెస్టెంట్ కాగా, మిగిలిన వాళ్లు మేల్ కంటెస్టెంట్స్. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus